క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం కీలకం

ABN , First Publish Date - 2022-07-07T06:52:10+05:30 IST

క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం కీలకమని ఎస్పీ సింధుశర్మ అన్నారు.

క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం కీలకం
మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ సింధు శర్మ -

- జగిత్యాల ఎస్పీ సింధుశర్మ 

పెగడపల్లి, జులై 6: క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం కీలకమని ఎస్పీ సింధుశర్మ అన్నారు. ఎల్‌.ఎం. కొప్పుల సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఎం.ఎన్‌.జే క్యాన్సర్‌ హాస్పిటల్‌ వారి సహకారంతో పెగడపల్లి మండలంలోని ఎల్లాపూర్‌ గ్రామంలో బుధవారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ  పరీక్షలు, హెల్త్‌ క్యాంపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ సింధు శర్మ, ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ స్నేహలతతో కలసి క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎల్‌.ఎం. కొప్పుల సోషల్‌ సర్వీస్‌ ఆధ్వర్యంలో జిల్లాలో కరోనా కష్టకాలంలో సైతం ముందుకు వచ్చి అనేక సంక్షేమ కార్యక్ర మాలు నిర్వహించారని, ట్రస్ట్‌ ద్వారా మారుమూల గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి  హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాలలో లభించే అధునాతన టెస్టులు చేయించడం ట్రస్టు చేస్తున్న సేవలు గొప్ప విషయమన్నారు. ప్రతి విభాగానికి చెందిన వైద్యులను గ్రామ స్థాయికి తీసుకువచ్చి శిబిరం నిర్వహిం చడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ పని ఒత్తిడిలో వ్యాధులను నిర్లక్ష్యం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దన్నారు. ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ కొప్పుల స్నేహలత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని చిన్న పిల్లలకు, మహిళలకు ఆరోగ్యం, విద్య అందించాలనే సంకల్పంతో ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 664 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి  మందులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ముద్దం అంజమ్మ మల్లేశం, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌ రావు, ఎంపీపీ గోళి శోభాసురేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, మార్కెట్‌ చైర్మన్‌ తిరుపతి నాయక్‌, ట్రస్టు మండల కన్వీనర్‌ కుసుమ శంకర్‌, సింగిల్‌విండో చైర్మన్లు భాస్కర్‌ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేశ్వర్‌ రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కొత్తపల్లి రవి, పార్టీ నాయకులు మల్లారెడ్డి, ఇరుగురాల ఆనందం, రంగు శ్రీనివాస్‌, ఎం.ఎన్‌.జే హాస్పిటల్‌కు చెందిన 18 మంది డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T06:52:10+05:30 IST