24 ఏళ్ల ఓ యువతికి వరుడు కావాలంటూ పేపర్లో ఇచ్చిన పెళ్లి ప్రకటన.. ఇంత వైరల్ అయిందేంటి..?

ABN , First Publish Date - 2021-06-10T21:57:36+05:30 IST

వరుడు లేదా వధువు కోసం పత్రికల్లో ప్రకటనలు రావడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం.

24 ఏళ్ల ఓ యువతికి వరుడు కావాలంటూ పేపర్లో ఇచ్చిన పెళ్లి ప్రకటన.. ఇంత వైరల్ అయిందేంటి..?

వరుడు లేదా వధువు కోసం పత్రికల్లో ప్రకటనలు రావడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తమకు కాబోయే వరుడు లేదా వధువుకు ఉండాల్సిన అర్హతలేంటో కూడా ఆ ప్రకటనల్లోనే చెబుతుంటారు. కులం, మతం, ఉద్యోగం, చదువు, ఆస్తుల గురించి ఈ ప్రకటనల్లో ప్రస్తావిస్తుంటారు. త్వరలో ఈ జాబితాలోకి `కోవిడ్ వ్యాక్సిన్` కూడా అర్హతగా చేరనుంది. 


ఈ నెల 4వ తేదీన వచ్చిన ఓ పెళ్లి ప్రకటన వైరల్‌గా మారింది. `రోమన్ కేథలిక్ కుటుంబానికి చెందిన మా అమ్మాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. ఆమెకు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న యువకుడు వరుడిగా కావాల`ని ప్రకటన ఇచ్చారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా సోషల్ మీడియాలో ఈ ప్రకటనను పోస్ట్ చేశారు. 


ఇంతగా వైరల్ అయిన ఈ యాడ్ ఫేక్ అని ఆ తర్వాత స్పష్టమైంది. ప్రజల్లో వ్యాక్సినేషన్ మీద అవగాహన కలిగించేందుకు గోవాలోని అల్డోనాకు చెందిన కమ్యునిటీ ఫార్మసిస్ట్ సావియో ఫిగ్యురెడో ఈ ప్రకటనను రూపొందించారు. `సెకెండ్ వేవ్‌లో నా స్నేహితులు కొందరు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ వేయించుకోమని బతిమాలినా వారు వేయించుకోలేదు. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకే ఈ యాడ్ రూపొందించి నా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశా. అది వైరల్‌గా మారింది. నా ఫోన్ నెంబర్‌కు రెండ్రోజుల పాటు వరుసగా కాల్స్ వచ్చాయ`ని సావియో తెలిపారు. ఈ ప్రకటన ఫేక్ అయితే కావొచ్చేమో కానీ, భవిష్యత్తులో పెళ్లి ప్రకటనల్లో మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ షరతు కూడా తప్పక ఉంటుందనడంలో సందేహం లేదు.  



Updated Date - 2021-06-10T21:57:36+05:30 IST