అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2022-05-28T05:42:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈశ్రమ్‌ పోర్టల్‌ ప్రవేశపెట్టిందని పాలకొల్లు అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి కేవీఎస్‌ శర్మ తెలిపారు.

అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌
సమావేశంలో మాట్లాడుతున్న లేబర్‌ ఆఫీసర్‌

ఆచంట, మే 27: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈశ్రమ్‌ పోర్టల్‌ ప్రవేశపెట్టిందని పాలకొల్లు అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి కేవీఎస్‌ శర్మ తెలిపారు. పంచాయతీ కార్యా లయం వద్ద శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 ఆగస్టు 26 నుంచి కార్మికుల రిజిస్ట్రేషన్‌ జరుగుతుందన్నారు. ఈశ్రమ్‌ పోర్టల్‌లో ఉచితంగానే పేర్లునమోదు జరుగుతుందన్నారు. నమోదు పక్రియ సమీపంలోని సీఎస్‌సీ సెంటర్‌, పోస్టాఫీసులలో జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నెం. 9492555079కు సంప్రదించాలని కోరారు. సమావేశంలో తోట వెంకటేశ్వరరావు, కార్యదర్శి బంగారు గోపి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T05:42:41+05:30 IST