సంయుక్త అజమాయిషీతో ఈ–క్రాప్‌

ABN , First Publish Date - 2022-08-18T06:48:35+05:30 IST

గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ సహాయకుల సంయుక్త అజమాయిషీతో ఈ–క్రాప్‌ నమోదు చేయాలని విజయవాడ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అరవ కుమార్‌ తెలిపారు.

సంయుక్త అజమాయిషీతో ఈ–క్రాప్‌
వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌

ముదినేపల్లి/రూరల్‌, ఆగస్టు 17 : గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ సహాయకుల సంయుక్త అజమాయిషీతో ఈ–క్రాప్‌ నమోదు చేయాలని విజయవాడ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అరవ కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన ముదినేపల్లి మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సందర్శించా రు. ఆర్బీకేల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు కల్పించే ఈ – క్రాప్‌ నమోదును పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కౌలు రైతులు రెవెన్యూ శాఖ ద్వారా పొందిన సీసీఆర్‌సి కార్డుల ద్వారా పంట నమోదు చేయించే విధంగా వీఆర్వోలు, గ్రామ వ్యవసాయ సహాయకులు చర్యలు తీసుకోవాల న్నారు. మండలంలో ధాన్యం తూకాలను నిర్వహించేందుకు వే బ్రిడ్జిలు ఎన్ని అవసరమో తెలియజేయాలన్నారు.  ఏవో వేణుమాధవ్‌, వీఏఏలు పద్మ, పవన్‌, శ్రీనివాస నాయక్‌, మందా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T06:48:35+05:30 IST