ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరి

ABN , First Publish Date - 2022-08-20T05:28:36+05:30 IST

జిల్లాలో ఈనెల 31లోపు ఈక్రాప్‌ నమోదు చెయ్యాలని వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వరరావు సూచించారు.

ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరి
రైతులతో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ జేడీ

పెనుమంట్ర / అత్తిలి, ఆగస్టు 19 : జిల్లాలో ఈనెల 31లోపు ఈక్రాప్‌ నమోదు చెయ్యాలని వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వరరావు సూచించారు. పొలమూరు, భట్లమ గుటూరులో శుక్రవారం ఆయ న పర్యటించారు. ఆర్‌బికె సి బ్బందితో మాట్లాడుతూ ఇప్ప టివరకు ఎంత నమోదైంది, అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్తిలి మండలం  మంచిలి ఆర్బీకేలో రైతులకు జేడీ వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. రైతులు గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో గానీ ఈకేవైసీ చేయించుకోవాలని, దీనివల్ల పీఎం కిసాన్‌ పథకం సొమ్ము రూ. 2 వేలు రైతుల ఖాతాల్లో జమవుతుందన్నారు. మండల వ్యవసాయాదికారి రాజేష్‌, ఆర్‌బీకే ఇన్‌చార్జి చంద్రిక రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T05:28:36+05:30 IST