5వ తేదీ లోపు ఈ–పంట నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-08-19T05:18:51+05:30 IST

వచ్చే నెల 5వ తదీ నాటికి ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన ఈ–పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసి ఆర్‌బీకేలో సామాజిక తనిఖీ చేయిచాలని గ్రామ రెవెన్యూ, వ్యవసాయ సహాయకులకు తహసీల్దార్‌ ఎస్‌.శాంతకుమారి, ఏవో బి.సుమలత సూచించారు.

5వ తేదీ లోపు ఈ–పంట నమోదు చేయాలి

బుట్టాయగూడెం, ఆగస్టు 18: వచ్చే నెల 5వ తదీ నాటికి ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన ఈ–పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసి ఆర్‌బీకేలో సామాజిక తనిఖీ చేయిచాలని గ్రామ రెవెన్యూ, వ్యవసాయ సహాయకులకు తహసీల్దార్‌ ఎస్‌.శాంతకుమారి, ఏవో బి.సుమలత సూచించారు. రెవెన్యూ కార్యాలయంలో గురువారం ఈ–పంట 2022 నమోదు, ఎ.సి.కె. యాప్‌పై అవగాహన సదస్సు జరగ్గా అధికారులు పాల్గొని మాట్లాడారు. ఈ–పంట నమోదు చేసే గ్రామాల్లో ఒకరోజు ముందుగానే మైక్‌ ద్వారా ప్రచారం చేయాలని, ఈ–పంట నమోదు వలన కలుగు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల కొనుగోలు పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని తెలిపారు.


Updated Date - 2022-08-19T05:18:51+05:30 IST