ఈ–క్రాప్‌ 79.10 %

ABN , First Publish Date - 2022-09-08T06:30:49+05:30 IST

ఈ–పంట నమోదు ప్రక్రియలో తరచూ రైతులు కష్టాలు పడుతూనే ఉన్నారు.

ఈ–క్రాప్‌ 79.10 %

తుది దశలో సాగుతున్న నమోదు

ఈ–పంట నమోదు చేయాల్సినది 5,12,911.55 ఎకరాలు

ఇప్పటివరకు పూర్తిచేసింది 4,05,737.09 ఎకరాలు

ఏలూరుసిటీ, సెప్టెంబరు 7: ఈ–పంట నమోదు ప్రక్రియలో తరచూ రైతులు కష్టాలు పడుతూనే ఉన్నారు. 2022 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ–పంట (ఈ–క్రాప్‌) నమోదు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే. ఎందుకంటె ప్రభుత్వం నుంచి రైతులకు అందే ప్రయోజనాలు పొందాలంటే ఈ–పంట నమోదు తప్పనిసరి.  ఈ–పంట నమోదుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఈ–క్రాప్‌ యాప్‌లో ఇబ్బందుల వల్ల తొలిదశలో జాప్యం జరిగిందని తెలుస్తోంది. ఈనెల 5వతేదీ లోగా ఈ–క్రాప్‌ పూర్తిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 79.10 శాతం నమోదు పూర్తయింది. ప్రభుత్వం అందించే రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకాలు పొందాలన్నా ఈ–పంట నమోదు చేసుకోవాల్సిందే. జిల్లాలో ఈ–పంట నమోదుకు సంబంధించి సాఽధారణ విస్తీర్ణం 5,12,911.55 ఎకరాలు కాగా ఇప్పటివరకు 4,05,737.09 ఎకరాలకు సంబంధించి నమోదు పూర్తయిందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రామకృష్ణ తెలిపారు. 


కొనసాగుతున్న ఈ–క్రాప్‌ నమోదు


జిల్లాలో ఈ–పంట నమోదు ప్రక్రియ కార్యక్రమం ఇంకా కొన సాగుతోంది.  ఇంకా 20 శాతం  నమోదు నిర్వహించాల్సి ఉండ టంతో గడువు పెంచారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 540 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–పంట నమోదు చేయించు కోవాల్సి ఉంది. రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ–పంట నమోదు ద్వారా ప్రభుత్వం అందించే ప్రయోజనాలతో పాటు తమ పంటను ధాన్యం కొను గోలు కేంద్రాలకు తరలించి అమ్ముకోవటానికి అవకాశం ఏర్పడు తుంది. ఈ–పంట యాప్‌లో సర్వర్‌ సమస్యలు, ఇతర సాంకేతిక సమస్యలు తరచూ ఎదురుకావటంతో కొంత జాప్యం జరిగిందని  చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయి నప్పుడు వచ్చే నష్టాలకు సంబంధించి పంట నష్టపరిహారం పొందాలన్నా, పంట రుణం రావాలన్నా ఈ–పంట నమోదు చేయించుకుని ఉండాలి. ప్రభుత్వం రాయితీ ద్వారా రైతులకు అందిచే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాలు పొందాలన్నా ఈ–పంట నమోదు తప్పనిసరి అని చెబుతున్నారు. 

Updated Date - 2022-09-08T06:30:49+05:30 IST