Abn logo
Sep 14 2020 @ 18:59PM

నిరుద్యోగులకు శుభవార్త.. ఈ-కామ్ ఎక్స్‌ప్రెస్‌లో 30వేలకు పైగా ఉద్యోగాలు

హైదరాబాద్‌: ఈ-కామర్స్ సంస్థలకు ఆద్యంతం లాజిస్టిక్ సొల్యుషన్స్ అందజేసే ఈ-కామ్ ఎక్స్‌ప్రెస్ నిరుద్యోగులు శుభవార్త అందించింది. ఈ నెల, వచ్చే నెలల్లో తమ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, హబ్స్, సార్టేషన్ సెంటర్స్, డెలివరీ సెంటర్స్‌లో 30వేలకు పైగా సీజనల్ ఉద్యోగాలను అందించనున్నట్లు ప్రకటించింది. పండగ అమ్మకాలు, డోర్ స్టెప్ డెలివరీలకు అవసరమైన బ్యాక్-అప్‌ కోసమే ఈ ఉద్యోగాలను సంస్థ కల్పించనుంది. దీనిలో అధిక శాతం ఉద్యోగాలు పొందేవారిలో డెలివరీ పర్సనల్, హబ్, సార్టింగ్ సెంటర్ అసోసియేట్స్, వేర్ హౌసింగ్ యాక్టివిటీలకు కావలసిన సిబ్బంది ఉంటారు. ఈ సీజనల్ ఉద్యోగాలు దేశం మొత్తం మీద ఏర్పాటు చేయనుండగా, వీటిలో 3/4 భాగం ఉద్యోగులు అహమదాబాద్, సూరత్, విజయవాడ, చండీగర్, ఇండోర్, పట్నా, లక్నో, కాన్పూర్, భోపాల్, జైపూర్ సహా అనేక మెట్రో నగరాలలో ఉద్యోగాలు పొందుతారు. కంపెనీ సెంటర్స్‌లో ఇన్హి-స్పీడ్ ఆటోమేటెడ్ సార్టర్లను ఇన్వెస్ట్ చేసింది. అదే విధంగా వ్యాపార పరిమాణంలో పెరుగుదలనూ హ్యాండిల్‌ చేసేలా సామర్థ్యాన్ని పెంపొందించుకుంటోంది.

Advertisement
Advertisement
Advertisement