తండ్రి ఆదర్శం - తనయుడి ఉదారత

ABN , First Publish Date - 2020-08-12T15:29:52+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ, ఆక్సిజన్‌ అందక పలువురు మృత్యువాత పడుతున్నారు. దీంతో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారావుగౌడ్‌ తనయుడు,

తండ్రి ఆదర్శం - తనయుడి ఉదారత

కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ సిలిండర్లు

సిద్ధం చేసిన తీగుల్ల రామేశ్వర్‌గౌడ్‌ 


రెజిమెంటల్‌బజార్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ, ఆక్సిజన్‌ అందక పలువురు మృత్యువాత పడుతున్నారు. దీంతో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారావుగౌడ్‌ తనయుడు, టీఆర్‌ఎస్‌ యువనేత తీగుల్ల రామేశ్వర్‌గౌడ్‌ మానవతా దృక్పథంతో స్పందించారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని 5 డివిజన్లలో ఒక్కొక్కటి చొప్పున 5 ఆక్సిజన్‌ సిలిండర్లను సిద్ధం చేశారు. సీతాఫల్‌మండి, బౌద్ధనగర్‌, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు చెందిన ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ (నెంబర్‌ 99591 53855) చేస్తే, వారికి ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ పంపించడానికి ఏర్పాట్లు చేశారు. 


24 గంటలూ అందుబాటులో ఉంటామని, నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామేశ్వర్‌గౌడ్‌ చెప్పారు. మంగళవారం టకారబస్తీలో ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంగా రామేశ్వర్‌గౌడ్‌ మాట్లాడుతూ తన సొంత నిధులతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో నియోజకవర్గంలోని 12వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన తన తండ్రి పద్మారావుగౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని, తాను కూడా కొవిడ్‌ వ్యాప్తి నివారణకు, రోగులకు అండగా ఉండాలని ముందుకు వచ్చినట్టు ఆయన వెల్లడించారు.

Updated Date - 2020-08-12T15:29:52+05:30 IST