ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు కానుంది. రేపటి నుండి వచ్చేనెల 14 వరకు ధనుర్మాసం సందర్భంగా ఈ సేవను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. దాని స్థానంలో తిరుప్పావై పాశురములు జరుగనున్నాయి. వచ్చేనెల 15 నుండి సుప్రభాత సేవ పునఃప్రారంభంకానున్నట్లు ఈవో పేర్కొన్నారు.