ప.గో: ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయ ఏఈవో రామాచారి.. గుండెపోటుతో మృతి చెందారు. అయితే రామాచారి మృతికి ఆలయ ఈవో సుబ్బారెడ్డే కారణమని దేవస్థానం సిబ్బంది ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి పదకొండు గంటల వరకు రామాచారి.. ఆలయ ఈవోతోనే ఉన్నారని చెబుతున్నారు. ఈవో వేధింపులపై రామాచారి.. గతంలో కుటుంబ సభ్యుల వద్ద వాపోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారన్నారు. ఈవో సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా సిబ్బంది ఆందోళన చేపట్టారు. వెంటనే ఈవోను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.