వేడుకగా..శ్రీచక్రవార్యుత్సవం

ABN , First Publish Date - 2022-05-18T06:05:54+05:30 IST

వేడుకగా..శ్రీచక్రవార్యుత్సవం

వేడుకగా..శ్రీచక్రవార్యుత్సవం
అశ్వవాహనంపై ఉభయదేవేరులతో స్వామివారు

తిరువీధుల్లో తొళక్కం, అశ్వవాహనాలపై ఊరేగిన చినవెంకన్న
ద్వారకాతిరుమల, మే 17: ఆలయ యాగశాల ప్రాంగణంలో మంగళవారం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా శ్రీచక్రవార్యుత్సవాన్ని జరిపించారు. ఆలయ ఆవరణలో శ్రీవారు, అమ్మవార్లు, చక్రపెరుమాళ్లును ఒక వేదికపై ఉంచారు. అనంతరం పూజాధికాలు చేసి సుగంధ ద్రవ్యాలు, పంచపల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్రపూత జలంతో శ్రీచక్రస్వామిని అభిషేకించారు. అనంతరం పంచా మృతాభిషేకాన్ని జరిపారు. తరువాత హారతులు ఇచ్చారు. అర్చకులు అభిషేక జలాన్ని భక్తుల శిర స్సులపై జల్లారు. సాయంత్రం పూర్ణాహుతి హో మాన్ని శాస్త్రోకంగా జరిపారు. ధ్వజ అవరోహణ. అశ్వవాహనంపై తిరువీధిసేవ భక్తులకు నేత్ర పర్వమైంది. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.



నిత్యకల్యాణ మండపంలో వేదసభ
హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని ఆలయ అర్చకులు ఉద్బో దించారు. శ్రీస్వామివారి నిత్యకల్యాణ మండప ఆవరణలో మంగళవారం సాయంత్రం వేద సభను ఆలయ అర్చకులు, పండితులు నిర్వ హించారు. తిరుకల్యాణ మహోత్సవాల సమయంలో రధోత్సవం జరిగిన మరుసటి రోజున వేదసభను జరపడం సంప్రదాయం. ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహ నంపై ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. మేళ తాళాలు, సన్నాయి వాయిద్యాలతో స్వామి వాహ నాన్ని నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తెచ్చారు. అనంతరం వేదికపై మూర్తులను ఉంచి అలంకరించారు. వివిధరకాల ఫలాలను, పుష్పా లను స్వామి ముందు ఉంచారు. వేదికపై అర్చ కులు వారికి ఎదురుగా పండితులు, అధి కారు లు, ఆగమ విద్యార్థులు కొలువుదీరారు. కల్యాణ మూర్తులను కీర్తిస్తూ మంత్రోచ్ఛరణ చేశారు. నీరాజన మంత్రపుష్పాలను సమర్పించారు. ఆల య అర్చకులు, పండితులు, అధికారులను ఆల య ప్రధాన అర్చకుడు అలహసింగరాచార్యులు సత్కరించారు.

Updated Date - 2022-05-18T06:05:54+05:30 IST