ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో నేటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 15 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. నేడు శ్రీ మహా రేణుకా దేవి అలంకరణలో కుంకుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో జి వి సుబ్బారెడ్డి తెలిపారు.