Abn logo
Apr 13 2021 @ 00:54AM

‘డ్వాక్రా బజార్‌’ నిర్వహణ గడువు పొడిగించాలి

కలెక్టర్‌కు నిర్వాహకుల విజ్ఞప్తి 

గవర్నర్‌పేట, ఏప్రిల్‌ 12: స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్‌ను ఈనె ల 28వరకు నిర్వహించుకునేందుకు అనుమతి పొడిగించాలని అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్‌ కమిటీ అధ్యక్షురాలు కె.దేవకీదేవి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే అనుమతి మం జూరులో ఆలస్యం కావడంతో నిర్వాహకులు నష్టపోయారని, కావున గడువు పొడిగించాలని ఈనెల 6న స్పందనలో అర్జీ పెట్టుకున్నామన్నా రు. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ సెక్రటరీ జె. ముర ళీ అనుమతులు ఇవ్వాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారన్నారు. కలెక్టర్‌ను కలువగా డీఆర్వో ను కలవాల్సిందిగా సూచించారన్నారు. తాము డీఆర్వోను కలవగా మహిళలని కూడా చూడకుండా చులకనగా మాట్లాడి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 28 వరకు ఉన్న అనుమతులు చూపించినా వినకుండా 6తో గడువు ముగిసిందని, ఖాళీ చేయాలని ఆదేశించారన్నారు. 4 రోజులుగా కరెంట్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, 13 జిల్లాల నుంచి 300 మంది ఉపాధి కోసం డ్వాక్రా మహిళలు ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటే అధికారులు కక్ష సాధించడం బాధాకరమన్నారు. కలెక్టర్‌ స్పందించి న్యాయం చేయాలని, స్టాల్స్‌ నిర్వహణకు 28 వరకు అనుమతి పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
Advertisement