మహిళా సంఘాల నిధులు రూ. 5.50లక్షలు పక్కదారి

ABN , First Publish Date - 2020-07-13T15:46:52+05:30 IST

మహిళ సంఘాల పొదుపు నిధులపై వెలుగు ఇందిరా క్రాంతిపధం అధికారుల పర్యవేక్షణ లేనుందున నిధులు పక్కదారిపట్టాయి. సం ఘంలోని మహిళ పేరిట రుణం మంజూరు చేసి, కొంతమంది వ్యక్తులకు లబ్ధి చే కూర్చారు.

మహిళా సంఘాల నిధులు రూ. 5.50లక్షలు పక్కదారి

మర్రిగూడ (నల్లగొండ): మహిళ సంఘాల పొదుపు నిధులపై వెలుగు ఇందిరా క్రాంతిపధం అధికారుల పర్యవేక్షణ లేనుందున నిధులు పక్కదారిపట్టాయి. సం ఘంలోని మహిళ పేరిట రుణం మంజూరు చేసి, కొంతమంది వ్యక్తులకు లబ్ధి చే కూర్చారు. నల్లగొండ జిల్లా ఎరుగండ్లపల్లి ఒకటో సంఘబంధం సభ్యులు 2011-14 సంవత్సరంలో జమచేసుకున్న నిధులను అధికారులు పక్కదారి పట్టించారు. ఈ సంఘం బంధం సభ్యుల పేరిట రూ.5లక్షల 50 వేల రుణాన్ని అధికారులు బ్యాం కు నుంచి డ్రా చేసి ఈ మహిళా గ్రూపులతో సంబంధంలేని కొందరు వ్యక్తుల పేరి ట ఇచ్చారు. డబ్బులు చెల్లించాలని మహిళలను బ్యాంకర్లు కోరడంతో విషయం బయటపడింది. మహిళా సంఘాల సభ్యులు అధికారులను నిలదీయగా మినిట్‌బుక్‌ను పరిశీలించారు. మహిళా సభ్యుల పేరిట కాకుండా వేరే వ్యక్తులకు రుణం ఇచ్చినట్లు బయటపడింది. దీనిపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని ఒకటవ సంఘబంధం అధ్యక్షురాలు రమ్య, కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. రుణాలు చెల్లించడంలేదనే నెపంతో తమ సంఘం బంఽధాన్ని అధికారులు రద్దు చేశారని, రద్దు చేసిన సంఘ బంధాన్ని కొనసాగించాలని కోరారు. ఈ విషయమై ఎరుగండ్లపల్లి సీసీ నర్సింహను వివరణ కోరగా సరైన సమాధానం ఇవ్వలేదు.

Updated Date - 2020-07-13T15:46:52+05:30 IST