Advertisement
Advertisement
Abn logo
Advertisement

డ్వాక్రా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలి

జేసీ  గంగాధర్‌ గౌడ్‌ 

అనంతపురం వ్య వసాయం, డిసెంబరు 7: డ్వాక్రా సంఘాల సభ్యులు ఆర్థికంగా  ఎదిగేందుకు కృషి చేయాలని జేసీ గం గాధర్‌గౌడ్‌ సూచించా రు. మంగళవారం స్థానిక టీటీడీసీలో ప్రశాంతి జిల్లా సమాఖ్య మహాసభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జేసీ గంగాధర్‌ గౌడ్‌ మాట్లాడుతూ... సంఘాలను బలోపేతం చేయడం ద్వారానే డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు పథకాల రుణాలు తీసుకోవడంతోపాటు సకాలంలో తిరిగి చెల్లించాలన్నారు. సంఘాలను సక్రమంగా నిర్వహించడంతోపాటు జీవనోపాధులు పెంపొందించుకునేలా చొరవ చూపాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. డ్వాక్రా సభ్యులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలన్నారు. సంఘాల్లో కొత్తగా లీడర్లుగా ఎంపికైన వారు నిబంధనల మేరకు  పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీసీఓ సుబ్బారావు, డీఆర్‌డీఏ ఏపీడీ ఈశ్వరయ్య, ఏజీఎం కామాక్షయ్య, డీపీఎం సత్యనారాయణ, ప్రశాంతి జిల్లాసమాఖ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement