అర్చక ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

ABN , First Publish Date - 2020-10-24T11:03:25+05:30 IST

రాష్ట్రంలో దేవాదాయశాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆ శాఖ అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ అన్నారు.

అర్చక ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

తెలంగాణ దేవాదాయశాఖ అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ డీవీఆర్‌శర్మ


కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 23: రాష్ట్రంలో దేవాదాయశాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆ శాఖ అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ అన్నారు. శుక్రవారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 686 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు గ్రాంట్‌ ఇన్‌ ఏయిడ్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాన్ని ఇచ్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనం చెల్లింపునకు బడ్జెట్‌లో 128 కోట్లు కేటాయిస్తుందన్నారు. కాగా ప్రస్తుతం 3,327 మందికి గ్రాంట్‌ ఇన్‌ ఏయిడ్‌ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ ఇంకా 2,326 మంది అర్చక సిబ్బందికి ప్రభుత్వ వేతనాలు రావాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రస్తుతం రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 10 లక్షలు మంజూరుకు ప్రత్నిస్తానని అన్నారు. దూప దీప నైవేద్య అర్చకులకు ప్రభుత్వం వారికి కేటాయించిన నిధుల ద్వారా వారికి పే స్కేలు వేతనం ఇచ్చినా ప్రభుత్వంపై అదనపు భారం పడదని, ఈ విషయాన్ని కూడా విన్నవిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బేతి రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్దర్శి ఆనంద్‌ శర్మ, కరీంనగర్‌ అర్చక  సంఘం అధ్యక్షులు నాగరాజు ఆచార్యులు, లక్ష్మీనారాయణ ఆచార్యులు, శంకరశర్మ, ఉద్యోగ సంఘం నాయకులు జగన్‌, సుధాకర్‌, మహేందర్‌, సన్నిహిత  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T11:03:25+05:30 IST