విధుల్లోకి తీసుకోవాలని నర్సుల ఆందోళన

ABN , First Publish Date - 2022-04-05T14:54:26+05:30 IST

కరోనా కాలంలో విధులు నిర్వహించిన తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సోమవారం స్థానిక డీఎంఎస్‌, మెరీనాతీరంలో నర్సులు ఆందోళనలు చేపట్టారు. కరోనా కాలంలో

విధుల్లోకి తీసుకోవాలని నర్సుల ఆందోళన

పెరంబూర్‌(చెన్నై): కరోనా కాలంలో విధులు నిర్వహించిన తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సోమవారం స్థానిక డీఎంఎస్‌, మెరీనాతీరంలో నర్సులు ఆందోళనలు చేపట్టారు. కరోనా కాలంలో బాధితులకు చికిత్స అందించేందుకు 2020లో 3,200 మంది నర్సులను తాత్కాలిక పద్ధతిలో వైద్య ఎంపిక బోర్డు నియమించింది. వారిలో 2,400 మందిని శాశ్వత ఒప్పంద పద్ధతిలో నియమిస్తామని, మిగిలిన 800 మందికి భవిష్యత్తులో చేపట్టబోయే పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందరినీ శాశ్వత ఒప్పంద పద్ధతిలో విధుల్లోకి తీసుకోవాలని నర్సులు కోరారు. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా 800 మంది నర్సుల ఒప్పందం గత నెల 31వ తేదీతో ముగియడంతో వారిని విధుల నుంచి తొలగించారు. దీంతో తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సుమారు 500 మంది నర్సులు స్థానిక డీఎంఎస్‌ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి తేనాంపేటలోని కమ్యూనిటీ హాలుకు తరలించారు. వారిలో కొందరు మెరీనా బీచ్‌ వద్దకు చేరుకొని అన్నా, కరుణానిధి స్మారక మందిరం ఎదుట రాస్తారోకో చేపట్టారు. వారిని పోలీసులు బలవంతంగా వ్యానుల్లో ఎక్కించి ట్రిప్లికేన్‌, సమీపంలోని కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. 

Updated Date - 2022-04-05T14:54:26+05:30 IST