డ్యూటీ డాక్టర్‌ డుమ్మా

ABN , First Publish Date - 2022-05-23T05:39:56+05:30 IST

డ్యూటీ డాక్టర్‌ డుమ్మా

డ్యూటీ డాక్టర్‌ డుమ్మా
ఆస్పత్రిలో రోగికి చికిత్స చేస్తున్న అటెండర్‌ రషీద్‌

  • వైద్యమందక రోగుల ఇక్కట్లు

పరిగి, మే 22: పరిగి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం అస్పత్రికి వచ్చిన రోగులకు వైద్య చేసేవారే లేరు. డ్యూటీ డాక్టర్‌ విధులకు రాకపోవడంతో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది సైతం గైర్హాజరయ్యారు. చివరకు అటెండరే వైద్యుడి అవతారమెత్తి చికిత్స చేశాడు. పరిగి పట్టణ కిష్టమ్మగుడితండాకు చెందిన కిషన్‌ ఛాతీ నొప్పితో అస్పత్రికి వచ్చాడు. డాక్టర్‌, సిబ్బంది లేక అటెండర్‌ రషీద్‌ చికిత్స చేశాడు. మంజుల అనే గర్భిణి పురుటి నొప్పులతో రాగా అటెండర్‌, స్టాఫ్‌నర్స్‌ తెలిసిన వైద్యం చేశారు. వెంటనే స్థానికులు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయడంతో ఆయన డాక్టర్‌ ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ను ఆస్పత్రికి పంపించారు. డాక్టరొచ్చి వైద్యంచేసిన అనంతరం రోగులు వెళ్లిపోయారు.

Updated Date - 2022-05-23T05:39:56+05:30 IST