Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయానికి సంకేతం దసరా

నేడు విజయదశమి       
పలు ఆలయాల్లో వాహన పూజలు
జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ సంవత్సరం కూడా లేని ఉత్సవాలు

కామారెడ్డి, అక్టోబరు 14: చెడుపై మం చి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుం టాం. ఈ పండుగను ప్రజలు శుక్రవా రం జరుపుకోనున్నారు. దసరా రోజు జమ్మి వృక్షానికి పూజలు చేసి పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతా యని ప్రజలు భావి స్తారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపారం తదితర పనుల నిమిత్తం పట్టణాలకు వలస వచ్చినవారు.. పండుగల సమయంలో స్వగ్రామాల్లోకి, బంఽధువుల ఇళ్లకు వెళ్తుంటారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలు ముఖ్యమైనవి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుంటారు. దీంతో పల్లెలు జనంతో కటకటలాడుతున్నాయి. దసరా పండుగ పూట కొత్త బట్టలు ధరించి పాల పిట్టలను చూడటానికి పొలాల వెంట వెళ్లడం ఆనవాయితి. పాల పిట్టను దర్శించుకున్న తరువాత ఆలయానికి వెళ్లి పూజలు చేసి తమకు అన్ని విజయాలు ప్రసాదించాలని వేడు కుంటారు. అనంతరం స్నేహితులు, బంధుమిత్రులకు జమ్మి ఆకులను పంచి ఆలింగనం చేసుకొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
పండుగ పరమార్థం
మానవుడిలో ఉన్న కామ, క్రోద, కోపతాపాలు వంటి చెడు లక్షణాలను అదుపులో ఉంచగలిగితే విజయం సాధించవచ్చని ఈ పండుగ పరమార్థం. చెడును వదిలి మంచి మార్గంలో నడుస్తూ మానవతా విలువలను కాపాడుతూ స్ర్తీలను గౌరవించేలా ఈ పండుగ సూచిస్తోంది. ప్రతీచోట రావణ దహనం చేస్తారు. పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులు ధరించి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయుధ పూజ, వాహన పూజలు చేస్తారు.
నవరాత్రుల వెనుక మరో కథనం
మానవులు, దేవతలను ముప్పు తిప్పలు పెడుతున్న మహిషా సురుడు అనే రాక్షసుడిని చంపడానికి దుర్గాదేవి అవతరించిందని ప్రతీతి, దుర్గాదేవికి త్రిమూర్తులతో పాటు సకల దేవతలు ఆయుధా లను అందించారు. దేవతలను, మనవులను ముప్పు తిప్పలు పెట్టిన మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు బీకర యుద్ధం చేసిన పదో రోజు విజయదశిమిన అతడిని వధించింది. అందుకే దసరా జరుపుకుంటారు.
జమ్మిచెట్టు ప్రత్యేకత
పాండవులు అజ్ఞాతంలోకి వెళ్లేటప్పుడు ఆయుధాలను జమ్మిచె ట్టుపై పెట్టారని పురణాలు చెబుతున్నాయి. అజ్ఞాత, వనవాసాన్ని పూర్తి చేసుకొని విజయదశమి రోజున జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసి పూజించి యుద్ధానికి వెళ్లారు. యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. అప్పటి నుంచి జమ్మి చెట్టుకు, ఆయుధాలకు వాహనాలకు పూజలు  చేయడం ఆనవాయితీగా వస్తోంది. దసరా ఉత్సవాన్ని పురస్కరించుకుని రావణ సంహరణ జరిగిన అనంతరం ప్రజలు తమ తల్లి తండ్రులు, అక్కా చెల్లెళ్ల దీవెనలు, పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు.
ఈ సంవత్సరం కూడా లేని ఉత్సవాలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించే రవాణ దహనం, లేజర్‌ షోను ఈ సంవత్సరం కూడా నిర్వహించడం లేదని దసరా ఉత్సవ కమిటీ చైర్మన్‌ రాజ్‌కూమార్‌, కమిటీ సభ్యులు తెలిపారు. గత సంవత్సరం కరోనా వైరస్‌ కారణంగా ఉత్సవాలు జరపడం లేదు. ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా ఉత్సవాలను నిర్వహించడం లేదు. ప్రతీ సంవత్సరం ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే ఉత్సవాలను ప్రజలు వేల సంఖ్యలో వచ్చి వీక్షించేవారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు అంతంతమాత్రంగానే జరగనున్నాయి.

Advertisement
Advertisement