Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబజేసే దసరా

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

రామచంద్రాపురం, అక్టోబరు 14 : దసరా పండుగ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబజేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం రామచంద్రాపురం పట్టణంలోని సండే మార్కెట్‌లో కార్పొరేటర్‌ బి.పుష్పనగేష్‌, భారతీనగర్‌ డివిజన్‌లో కార్పొరేటర్‌ వి.సింధూఆదర్శరెడ్డి, తెల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెపల్లి లలితాసోమిరెడ్డి, కౌన్సిలర్‌ చిట్టి ఉమేశ్వర్‌ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మను నిర్వహించారు. రామచంద్రాపురం పట్టణంలో అందమైన బతుకమ్మలను పేర్చిన మహిళలకు రూ.20, 10, రూ.5 వేల నగదు బహుమతిని ఎమ్మెల్యే అందించారు. భారతీనగర్‌లో బతుకమ్మ విజేతలకు ఎమ్మెల్యేతో కలిసి కార్పొరేటర్‌ వి.సింధూఆదర్శరెడ్డి బహుమతులు అందజేశారు. ఉస్మాన్‌నగర్‌లో కౌన్సిలర్‌ అంతగిరిపల్లె చిట్టి ఉమేశ్వర్‌ విజేతలకు పట్టుచీరలు అందించారు. 

Advertisement
Advertisement