Abn logo
Oct 17 2021 @ 00:48AM

అంబరాన్నంటిన దసరా సంబరాలు

దర్మపురిలో శమీ పూజలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- శమీ పూజ నిర్వహించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కలెక్టర్‌

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 16 : జగిత్యాల జిల్లా కేం ద్రంలో విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జంబి గద్దె వద్దకు తీసుకువ చ్చారు. జంబి గద్దె లోపల శమీ వృక్షాన్ని నెలకొల్పారు. కలెక్టర్‌ రవి, బల్దియా చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌ కుమార్‌, కౌన్సిలర్లు హాజరై శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్‌ రవి విజయదశమి వేడుకలను ప్రారంభించారు. ప్రజలంతా ఆయురారోగ్యా లతో, సుఖసంతోషాలతో వర్థిల్లాలని కలెక్టర్‌ కోరారు. జనం పెద్దఎత్తున జంబి గద్దె వద్దకు చేరుకుని జమ్మీ ఆకును ఒకరికొకరు ఇచ్చుకుం టూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం లో ఆయుధ, వాహన పూజ కార్యక్రమాన్ని ఎస్పీ సింధు శర్మ, అడ్మిన్‌ ఎస్పీ సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వ హించారు. ధరూర్‌ క్యాంప్‌లోని కోదండ రామాలయం, పద్మనాయక కల్యాణ మండపంలో వెలమ సంక్షేమ సం ఘం, వైశ్య భవన్‌, ఏఎంసీ మార్కెట్‌యార్డులో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించారు. అలాగే జగిత్యాల  పట్టణంలో దసరా దేవుని  ఊరేగింపు  కార్యక్రమాన్ని  వైభవంగా     నిర్వహించారు.

జగిత్యాలలో మహిషాసురుని దహనం వైభవంగా జరిగింది. విజయదశమి ని పురస్కరించుకుని యేటా జంబిగద్దె ప్రాంతంలో మహిషాసురుని ప్రతిమను దహనం చేస్తుంటారు. ఇందులో భాగంగా నవదుర్గ, కనక దుర్గ సేవా సమితిల ఆధ్వర్యంలో మహిషాసురుని ప్రతిమను టపాసులు పెట్టి పేల్చారు. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలోని బీట్‌ బజార్‌ చౌరస్తాలో నిర్వహించిన మహిశ సంహారం వేడుకలను నిర్వా హకులు ఘనంగా నిర్వహించారు. 

ఫ ధర్మపురి: ధర్మపురి క్షేత్రంలో దసరా ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రచారరథం తోడుగా స్వామి వారల సేవలను చింతామణి చెరువు గట్టు మీదుగా క్షేత్ర సమీపంలో గల నూతన జమ్మిగద్దె  వరకు ఊరే గింపు జరిపారు. అనంతరం ఆలయ వేద పండితులు సాంప్రదాయ రీతిలో శమీ వృక్ష పూజలు నిర్వహించారు. అనంతరం  భక్తులు స్వామి వారలను దర్శనం చేసుకు న్నారు. ఈ సందర్భంగా ఏటా నిర్వహించే విధంగా పోలీస్‌ శాఖ పక్షాన ధర్మపురి సీఐ బిళ్ల కోటేశ్వర్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ గౌరవ వందనంగా తుపాకితో చెరి ఒక రౌండ్‌ చొప్పున రెండుసార్లు గాలిలోకి కాల్పులు జరిపా రు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరి నదీ తీరానగల శ్రీ శివసాయి బాలాజీ ఆలయంలో అర్చకులు స్వామి వారలకు క్షీరాభిషేకం జరిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్‌, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరు రాజేష్‌కుమార్‌, వైస్‌చైర్మన్‌ అక్కెనపెల్లి సునీ ల్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, ఆలయ సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఇందారపు రామయ్య, కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ మం డల, పట్టణ శాఖల అధ్యక్షులు సంగనభట్ల దినేష్‌, మొగిలి శేఖర్‌, ఆకుల రాజేష్‌, సంగెపు గంగారం తదితరులు పాల్గొన్నారు.