ముగిసిన దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-07T05:22:18+05:30 IST

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా పండుగ ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. రాయచోటి, రాజం పేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని అమ్మవారి ఆలయాల్లో 10 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్నిచోట్ల అన్నదానాలు, గ్రామోత్సవం కన్నుల పండువగా చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ముగిసిన దసరా ఉత్సవాలు
రాయచోటి భద్రకాళీ సమేత వీరభద్రుడి ఉత్సవ విగ్రహ ఊరేగింపు దృశ్యం

అమ్మవారికి ప్రత్యేక పూజలు

పలుచోట్ల గ్రామోత్సవం, అన్నదానం


దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా పండుగ ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. రాయచోటి, రాజం పేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని అమ్మవారి ఆలయాల్లో 10 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్నిచోట్ల అన్నదానాలు, గ్రామోత్సవం కన్నుల పండువగా చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు 

పొందారు. 


రాయచోటిటౌన్‌/రాజంపేటటౌన్‌/ఒంటిమిట్ట/ నందలూరు/సుండుపల్లె/వీరబల్లి/ఓబులవారిపల్లె/ గాలివీడు/సంబేపల్లె/లక్కిరెడ్డిపల్లె/చిన్నమండెం, అక్టోబరు 6: రాయచోటి పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో భద్రకాళీ అమ్మవారు బుధవారం విజయదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో పాటు గాజులు తదితర వాటితో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌ పోలంరెడ్డి విజయ, ఆలయ ఈవో డీవీ రమణారెడ్డిల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శంకరయ్య, క్రిష్ణయ్య స్వాములు ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా భజన మాస్టార్‌ తుమ్మల హరినాధ్‌ ఆధ్వర్యంలో మహిళా బృందంచే నిర్వహించిన కోలాటం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. అలాగే పాతరాయచోటిలోని ద్రాక్షాయణి సమేత అగస్తేశ్వర ఆలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. అలాగే కొత్తపేట రామాపురంలోని చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా, కొత్తపేట ఠాగూర్‌వీధిలో గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అ మ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. 

రాజంపేటలో దసరా మహోత్సవాల్లో చివరి రోజైన గురువారం తెల్లవారుజామున రాజంపేటలో కన్యకాపరమేశ్వరిదేవి గ్రామోత్సవం కన్నులవిందుగా జరిగింది. ప్రజలు,  భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అలాగే వసంతోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో రాత్రికి అమ్మవారికి ఊంజల సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం రాత్రిఅమ్మవారిని  రాజరాజేశ్వరిదేవి అలంకారంలో అలంకరించి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయం నుంచి పాతబస్టాండు వద్ద ఉన్న జమ్మిచెట్టు దగ్గరికి తీసుకెళ్లి శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాతబస్టాండు సర్కిల్‌లో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల బాణాసంచాలను తెప్పించి రాజంపేట దద్దరిల్లిపోయేలా పే ల్చారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు రాజంపేట పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ గ్రామోత్సవంలో కేరళ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక విద్యుత్‌ దీపాలంకరణ, డప్పు మేళాలు, వాయిద్యాలను ఏర్పాటు చేశారు. ప్రజలు తండోపతండాలుగా తరలిరావడంతో డీఎస్పీ శివభాస్కర్‌ అధ్వర్యంలో పట్టణ, రూరల్‌ సీఐలు, ఎస్‌ఐలు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 

అలాగే ఒంటిమిట్టలోని ఏకశిలా నగరి కోదండ రామాలయంలో దశమి రోజున సీతారామ లక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించి శమీ దర్శనం కోసం బాజా భజంత్రీలు భక్త సందోహం మధ్య నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా బాణాలను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవికి గ్రామోత్సవం నిర్వహించారు. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లెలో వీరబ్రహ్మేం ద్రస్వామి ఆలయంలో కొలువైన కాళికాంబ అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాకుండా సుండుపల్లెలోని నల్లగుట్టపల్లెలో హోమాలు నిర్వహిం చారు. మండల కేంద్రంలోని వైశ్యబజారులో ఉన్న కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఇక వీరబల్లిలోని మట్లి గ్రామంలో దసరా వైభవంగా జరిగింది. అమ్మవారిని పల్లకీలో అలంకరించి డప్పు వాయిద్యాలు, చెక్కభజనల నడుమ ఊరేగించారు. సంబేపల్లెలో నల్లగంగమ్మతల్లి బుధవారం రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాలివీడులోని బలిజపల్లె సమీపంలో ఏటిగడ్డ గంగమ్మ, నాగులపల్లెలోని ఎల్లమ్మ, పసులవాండ్లపల్లె సమీపంలోని దుర్గామాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లక్కిరెడ్డి పల్లెలోని సర్వమంగళాదేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. చిన్నమం డెంలో ఊంజల్‌సేవలో అమ్మవారు కొలువయ్యారు. 





Updated Date - 2022-10-07T05:22:18+05:30 IST