కన్నులపండువగా పంచపాండవుల ఉత్సవం

ABN , First Publish Date - 2020-10-27T10:24:16+05:30 IST

పంచపాండవుల ఉత్సవాలను ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని పింజరమడుగులో దసరా సందర్భంగా రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించారు

కన్నులపండువగా పంచపాండవుల ఉత్సవం

కామేపల్లిలోని పింజరమడుగులో విగ్రహ రూపాలు


కామేపల్లి, అక్టోబరు 26:  పంచపాండవుల ఉత్సవాలను ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని పింజరమడుగులో దసరా సందర్భంగా రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించారు. గ్రామంలో 200 ఏళ్ల నాటి పురాతన పంచపాండవుల దేవాలయం ఉంది.  ఏటా విజయదశమి పర్వదినాన శ్రీక్రిష్ణ పంచపాండవుల విగ్రహాలను ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామంలో ఊరేగిస్తారు. విజయదశమినాడు సాయంత్రం విగ్రహాలను రథంలో ఎక్కించి మొదట ఊరి చివర జమ్మి చెట్టు దగ్గరకు తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించి, ఉత్సవాలు ప్రారంభించారు. మొదటిరోజు రాత్రి సన్నాయి మేళంతో గ్రామంలో తండాలలో ఊరేగించి, మరుసటి రోజు పింజరమడుగు గ్రామంలో ప్రతి ఇంటికి దగ్గర ఆగి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. రెండో రోజు విగ్రమల ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది.

Updated Date - 2020-10-27T10:24:16+05:30 IST