కొద్ది గంటల్లో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన ఈ వరుడు.. ఇలా రోడ్డు మీద ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-25T22:18:08+05:30 IST

అబ్బాయి, అమ్మాయి ఒకొరికొకరు నచ్చారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఓ తేదీని కూడా ఖరారు చేసుకున్నారు. దీంతో వారి ఇళ్లలో పెళ్లి సందడి మొదలైంది. అనుకున్న తేదీ రానే వచ్చింది. ఈ క్రమంలో ఆనందోత్సహాల మధ్య వరుడు బంధుమిత్రులతో కలిసి, వధువు ఇంటికి చేరుకున్నాడు. మరికొన్ని గంటల్లో వరుడు, తన

కొద్ది గంటల్లో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన ఈ వరుడు.. ఇలా రోడ్డు మీద ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అబ్బాయి, అమ్మాయి ఒకొరికొకరు నచ్చారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఓ తేదీని కూడా ఖరారు చేసుకున్నారు. దీంతో వారి ఇళ్లలో పెళ్లి సందడి మొదలైంది. అనుకున్న తేదీ రానే వచ్చింది. ఈ క్రమంలో ఆనందోత్సహాల మధ్య వరుడు బంధుమిత్రులతో కలిసి, వధువు ఇంటికి చేరుకున్నాడు. మరికొన్ని గంటల్లో వరుడు, తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడన్న సమయంలో ఎవ్వరూ ఊహించని ఓ ఘటన అక్కడ చోటు చేసుకుంది. దీంతో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు నడీ రోడ్డుపై కూర్చోవాల్సి వచ్చింది. కాగా.. అక్కడ చోటు చేసుకున్న అనూహ్య ఘటన ఏంటనే వివరాల్లోకి వెళితే..



ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి ప్రాంతానికి చెందిన లియాఖత్ తన కుమారుడికి.. రాజేంద్రనగర్‌కు చెందిన ఆరీఫ్ కూతురు హీనాతో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చడంతో ఇరు కుటంబ సభ్యులు పెళ్లి తేదీని ఖారారు చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం కుటంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వరుడు, వధువు ఇంటికి చేరుకున్నాడు. మరికొద్ది గంటల్లో పెళ్లి జరగనుండగా.. అక్కడ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కట్నం విషయంలో వాగ్వాదం మొదలైంది. చిన్న గొడవ కాస్తా.. కర్రలతో కొట్టుకునే వరకూ వెళ్లింది. ఈ వివాదంలో పెళ్లి కుమారుడు తల్లి సహా ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ గొడవ కారణంగా పెళ్లి పీటలపై ఉండాల్సిన వరుడు రోడ్డుపై కూర్చోవాల్సి వచ్చింది. 


ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పెళ్లి మండపం వద్ద కొత్త బండి కనబడకపోవడంతో వరుడు వాగ్వాదానికి దిగినట్టు వధువు తరఫు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా బంగారం విషయంలో కూడా వరుడు తరఫు వారు అభ్యంతరం తెలిపారని ఆరోపించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2021-10-25T22:18:08+05:30 IST