ఎనిమిదేళ్ల పాలనలో ఒరగబెట్టిందేమీ లేదు

ABN , First Publish Date - 2022-05-19T06:23:04+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు ఒదగబెట్టిందేమీలేదని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

ఎనిమిదేళ్ల పాలనలో ఒరగబెట్టిందేమీ లేదు
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

వేములవాడ రూరల్‌, మే 18: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు ఒదగబెట్టిందేమీలేదని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వేములవాడ రూరల్‌ మండలంలోని చెక్కపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివా్‌స్‌. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణతో కలిసి బుధవారం మండల కార్యకర్తలతో  సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలు పెంచుతూ,  రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను అరిగోస పెడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ప్రతీ  కార్యకర్త కృషి చేయాలన్నారు. వరంగల్‌లో జరిగిన  రాహుల్‌ గాంధీ రైతు సంఘర్షణ సభతో ప్రజా సంక్షేమ ప్రభుత్వం రానున్నదన్న ఆశాబావం ప్రజల్లో  వ్యక్తమవుతోందన్నారు. బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఇప్పటి వరకు పార్లమెంటు పరిధిలో ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు.  మతాన్ని అడ్బు పెట్టుకొని  పబ్బం గడపడం తప్ప ఏమి తెలియని పార్టీ బీజేపీయేనన్నారు.  రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు.  పార్టీ మండల అధ్యక్షుడు వకులా భరణం శ్రీనివాస్‌,  మహిళా మండలి మండల అధ్యక్షురాలు సోయినేని లహరి, సర్పంచ్‌ కరుణాకర్‌, నాయకులు రంగు వెంకటేశం, సంఘ స్వామి, బొడ్డు రాములు, తిరుపతి రెడ్డి, ఎడవెల్లి అనీల్‌, జాగిరి సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.త

Updated Date - 2022-05-19T06:23:04+05:30 IST