రైతు ప్రతినిధులకు చర్చల మినిట్స్ అందజేసిన కేంద్రం

ABN , First Publish Date - 2020-12-05T22:59:47+05:30 IST

రైతు ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య ఐదో విడత చర్చలు విజ్ఞాన్‌భవన్‌లో శనివారం ..

రైతు ప్రతినిధులకు చర్చల మినిట్స్ అందజేసిన కేంద్రం

న్యూఢిల్లీ: రైతు ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య ఐదో విడత చర్చలు విజ్ఞాన్‌భవన్‌లో శనివారం మధ్యాహ్నం జరిగాయి. నాలుగో విడత చర్చలకు సంబంధించిన మినిట్స్‌ను రైతు ప్రతినిధులకు కేంద్రం ఈ సందర్భంగా అందజేసింది. పాయింట్ల వారీగా లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని గత సమావేశంలో రైతు ప్రతినిధులు కేంద్రాన్ని కోరారు. ఐదో విడత చర్చల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గెయెల్ ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా వ్యవహరించారు.


ఈ సమావేశానికి ముందు, ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర మంత్రులు కలుసుకున్నారు. రైతు ప్రతినిధులతో ఇంతవరకూ జరిగిన చర్చల వివరాలను ప్రధానికి వివరించారు. కాగా, కేంద్రంతో చర్చలకు వెళ్లిన రైతు ప్రతినిధులకు లంచ్ ఆఫర్ చేసినప్పటికీ వారు తమతో తెచ్చుకున్న ఆహారాన్నే తీసుకున్నారు. తదుపరి చర్చలను తాము కోరుకోవడం లేదని, రైతుల డిమాండ్లపై కేంద్ర నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని మాత్రమే అనుకుంటున్నామని ఈ సందర్భంగా రైతు నేతలు తెలిపారు.

Updated Date - 2020-12-05T22:59:47+05:30 IST