Durgapur flight: స్పైస్‌జెట్ విమాన ఘటనపై దర్యాప్తు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-03T02:12:20+05:30 IST

ముంబై నుంచి దుర్గార్‌పూర్ వెళ్తూ ల్యాండింగ్ సమయంలో తీవ్ర కుదుపులకు లోనైన

Durgapur flight: స్పైస్‌జెట్ విమాన ఘటనపై దర్యాప్తు ప్రారంభం

న్యూఢిల్లీ: ముంబై నుంచి దుర్గార్‌పూర్ వెళ్తూ ల్యాండింగ్ సమయంలో తీవ్ర కుదుపులకు లోనైన SpiceJet విమాన ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు ప్రారంభించింది. విమానంలో తీవ్రమైన కుదుపుల కారణంగా బ్యాగేజీలు ప్రయాణికులపై పడ్డాయి. ఈ ఘటనలో 15 మంది వరకు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, ప్రయాణికులను సీటు బెల్టులు పెట్టుకునే ఉండాలని విమాన సిబ్బంది పదేపదే అభ్యర్థించినట్టు స్పైస్‌జెట్ తెలిపింది.


ఈ ఘటనపై పౌర విమానయాన మంత్రి Jyotiraditya Scindia విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు నష్టం జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై దర్యాప్తును డీజీసీఏ ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తు పూర్తయిన వెంటనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు మంత్రి తెలిపారు.  

Read more