బాలీవుడ్లో దక్షిణాది సినిమాలు సత్తా చాటుతున్నాయి. మన చిత్రాలను బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. రీసెంట్గా 'కాంచన' చిత్రాన్ని 'లక్ష్మీ' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగులో సూపర్‌హిట్ అయిన 'భాగమతి' చిత్రాన్ని బాలీవుడ్లో 'దుర్గామతి' పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో అనుష్క పోషించిన పాత్రను హిందీలో భూమి పెడ్నేకర్ పోషించారు. డిసెంబర్ 11న ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేశారు. 'భాగమతి' చిత్రాన్ని తెరకెక్కించిన అశోక్ దర్శకత్వంలోనే 'దుర్గామతి' తెరకెక్కింది. అలాగే ఇక్కడ మెయిన్ విలన్‌గా జయరాం నటించగా.. హిందీలో ఈ పాత్రను అర్షద్ వార్సీ పోషించారు.