శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గాదేవి

ABN , First Publish Date - 2021-10-11T01:17:27+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగజ్జనని దుర్గమ్మ నాలుగోరోజు ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి

శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గాదేవి

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగజ్జనని దుర్గమ్మ నాలుగోరోజు ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవిలు ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా.. చెరకుగడను చేతపట్టుకుని.. శివుని వక్షస్థలంపై ఆశీనురాలై.. చిరుమందహాసంతో అనుగ్రహమిచ్చిన అమ్మవారిని హోంమంత్రి మేకతోటి సుచరిత, బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిప్‌ అరుప్‌ కుమార్‌ గోస్వామి తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదశాక్షరీ మహామంత్రాది దేవతగా తనన కొలిచేవారికి అనుగ్రహమిచ్చే జగన్మాత కటాక్షం పొందేందుకు భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ ముగిసిన తర్వాత ప్రదోష కాలంలో శ్రీ గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు. 

Updated Date - 2021-10-11T01:17:27+05:30 IST