కారులో అక్రమ మద్యం ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-10-02T08:16:56+05:30 IST

తన కారులో అక్రమ మద్యం కలిగి ఉన్న వ్యవహారంలో విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యత్వానికి చుక్కా నాగవరలక్ష్మి రాజీనామా చేశారు. గురువారం ఉదయం ఆమె రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానుకు, దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడుకు అందజేశారు...

కారులో అక్రమ మద్యం ఎఫెక్ట్‌

  • దుర్గగుడి పాలక మండలి సభ్యురాలి రాజీనామా

జగ్గయ్యపేట, అక్టోబరు 1: తన కారులో అక్రమ మద్యం కలిగి ఉన్న వ్యవహారంలో విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యత్వానికి చుక్కా నాగవరలక్ష్మి రాజీనామా చేశారు. గురువారం ఉదయం ఆమె రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానుకు, దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడుకు అందజేశారు. పైలా ఆమె రాజీనామాను ఆమోదించారు. తన కారులో దొరికిన మద్యంతో తనకు సంబంధం లేనప్పటికీ తన కుమారుడు నిర్దోషిగా తేలే వరకు పదవికి దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ కేసులో తొలుత ఆమె భర్తను నిందితునిగా చేర్చగా, తర్వాత ఆయన పాత్ర లేదని భావించిన పోలీసులు.. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఆమె కుమారుని పేరు చేర్చారు.

Updated Date - 2020-10-02T08:16:56+05:30 IST