దుర్గా నవరాత్రులు

ABN , First Publish Date - 2021-10-10T05:30:00+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలలో నాలుగో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు ...

దుర్గా నవరాత్రులు

నేటి అలంకరణ

శ్రీ లలితా త్రిపురసుందరీదేవి 

10- 10- 2021

ఆశ్వయుజ శుద్ధ చవితి, ఆదివారం


శరన్నవరాత్రి ఉత్సవాలలో నాలుగో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఆమెది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువై ఉంటుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి, శివుడి వక్షస్థలంపై కూర్చుని భక్తులకు వరాలిస్తుందనీ, పంచ, దశాక్షరీ మహా మంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తుల్నీ, ఉపాసకుల్నీ అనుగ్రహిస్తుందనీ భక్తులు నమ్ముతారు. 

లలితాదేవి విద్యా స్వరూపిణి.  సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అనీ, మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందనీ విశ్వాసం. లలితాదేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చెయ్యాలనీ, వివిధ పూలతో, కుంకుమతో అర్చించాలనీ పురాణాలు పేర్కొంటున్నాయి. త్రిమూర్తులు, సకల దేవతలు ఆమెను కొలుస్తారనీ, ఆమెను ఆరాధించిన వారికి ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యాలు కలుగుతాయనీ చెబుతున్నాయి.


నైవేద్యం: అల్లం గారెలు, ఐదురకాల తీపి పదార్థాలు

అలంకరించే చీర రంగు: బంగారు వర్ణం

అర్చించే పూల రంగు: వివిధ రకాలు

పారాయణ: చెయ్యాల్సింది: లలితా సహస్రనామం


Updated Date - 2021-10-10T05:30:00+05:30 IST