Durga Puja: 8 లోహాలతో తయారైన దుర్గా విగ్రహం 11 అడుగుల ఎత్తు, 1000 కిలోల బరువు ఉంది.. అదెక్కడో తెలుసా?

ABN , First Publish Date - 2022-09-23T18:09:02+05:30 IST

శారద నవరాత్రుల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కోల్ కత్తాలో దుర్గా మాత విగ్రహాలను ఏర్పాటు చేస్తే.. మైసూరులో తొమ్మిది రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు.

Durga Puja: 8 లోహాలతో తయారైన దుర్గా విగ్రహం 11 అడుగుల ఎత్తు, 1000 కిలోల బరువు ఉంది.. అదెక్కడో తెలుసా?

శారద నవరాత్రుల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కోల్‌కతాలో దుర్గా మాత విగ్రహాలను ఏర్పాటు చేస్తే.. మైసూరులో తొమ్మిది రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ దేవీ శరన్నవరాత్రుల వేడుకలు కాస్త విభిన్నంగా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే రెండు సంవత్సరాల కోవిడ్ తర్వాత ఢిల్లీ నవరాత్రి దుర్గాపూజలను ఉత్సాహంగా జరుపుకోవడానికి సిద్ధమవుతుంది., కోవిడ్ మహమ్మారి సమయంలో ఎదుర్కొన్న నష్టాన్ని పూరించడానికి అన్నట్టు కళాకారులు కాస్త భిన్నంగా ఉండే విగ్రహాలను తయారు చేయడంలో కృషి చేస్తున్నారు. 


ఈ ఉత్సవాలకు సన్నద్ధమవుతూ ఉత్తర కోల్‌కతాలోని సోవాబజార్ ప్రాంతంలోని క్లబ్ వారు భారీ దుర్గామాత విగ్రహాన్ని తయారు చేయించారు. దీనిలో చాలా ప్రత్యేకతలున్నాయి. విగ్రహం మూల నిర్మాణమంతా ఫైబర్‌తో తయారు చేసి... ఆక్టో-అల్లాయ్‌తో పూత (ఎనిమిది లోహాలు కలిపిన పూత) పూసారు. దీనిని తయారు చేయడంలో సెలబ్రేట్ ఐడల్-క్రాఫ్టర్ మింటు పాల్ మొత్తం ప్రాజెక్ట్‌కు బాధ్యత వహించారు. బెనియాటోలా సర్బోజనిన్‌కు చెందిన నిర్వాహకులు అక్టోబర్ 1న ప్రారంభమయ్యే దుర్గాపూజ కోసం ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.


విగ్రహం విశేషాలు..

1. ఒక టన్ను లేదా వెయ్యి కిలోగ్రాముల కంటే కొంచెం ఎక్కువ బరువున్న దేవతా విగ్రహం ఇది.

2. ఇప్పటి వరకు రాక్షస సంహారకుడి భారీ విగ్రహం ఇంత గొప్పగా తయారు చేయడం కూడా ఇదే మొదటిసారి.

3. 'అష్టధాతు' లేదా ఆక్టో-అల్లాయ్‌తో తయారు చేసిన, దుర్గా దేవి విగ్రహం 11 అడుగుల ఎత్తు ఉంది.

4. 'అష్టధాతు'  గణేష్, లక్ష్మి, సరస్వతిలతో పూర్తి సెట్ మొత్తం విలువ సుమారు 15 లక్షల రూపాయలు.

5. ఇప్పటివరకు చూడని అత్యంత ఖరీదైన విగ్రహంగా ఇది రికార్డును బద్దలు కొట్టింది. 


విగ్రహం తయారీ వెనుక కథ..

మింటూ కళాకారుడి చేతిలో రూపుదిద్దుకున్న విగ్రహానికి ఆయనతో పాటు చాలామంది కళాకారులు మెరుగులు దిద్దారు. ఫైబర్ నిర్మాణానికి మొదటి బృందం మూడు నెలల పాటు పనిచేసింది. ఆ తర్వాత విగ్రహం మీద ఆక్టో అల్లాయ్ పూతకి మరో ఐదున్నర నెలలు సమయం పట్టింది. 


ఈ విగ్రహం స్థానిక ప్రాంతంలోని ఒక ఆలయంలో ఉంచి ఈ సంవత్సరం దుర్గాపూజ ఉత్సవంలో పూజించినా, ఆ తరువాత ఓ ప్రత్యేకమైన గుడిని నిర్మించి అందులో ఈ విగ్రహాన్ని ఉంచుతారు. కోల్‌కతా దక్షిణ భాగంలో ఇటువంటి విగ్రహమే గతంలో తయారుచేసి పెట్టినా దానికి చుట్టూ గణేష్, లక్ష్మి, సరస్వతిల విగ్రహాలు లేవు.


ఈ విగ్రహాన్ని 16 చక్రాల ట్రైలర్‌పై మహిషదల్ నుండి కోల్‌కతాకు తీసుకువచ్చారు, ఆ తర్వాత దానిని క్రేన్ సహాయంతో ఆలయం లోపల ఉంచారు. దుర్గాదేవి చేతిలో ఉంచాల్సిన ఆయుధాలను కూడా ప్రత్యేకంగా తయారుచేస్తున్నట్టు అక్కడి కళాకారులు చెపుతున్నారు. దసరా వేడుకల్లో ఈ విగ్రహం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దసరా పూజలో దుర్గావిగ్రహం విశేషాలు మరింత  భక్తులను ఆకర్షించే అవకాశం ఉంది.

Updated Date - 2022-09-23T18:09:02+05:30 IST