నకిలీలపై కఠినంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2021-06-12T05:47:25+05:30 IST

నకిలీ విత్తనాలు అమ్మినా.. సరఫరా చేసినా.. తయారు చేసిన కఠిన చర్యలు తప్పవని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో వానాకాలం సాగు, నకిలీ విత్తనా లు ఇతర అంశాలపై పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.

నకిలీలపై కఠినంగా వ్యవహరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు 

అధికారుల సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి


నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 11: నకిలీ విత్తనాలు అమ్మినా.. సరఫరా చేసినా.. తయారు చేసిన కఠిన చర్యలు తప్పవని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో వానాకాలం సాగు, నకిలీ విత్తనా లు ఇతర అంశాలపై పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నకిలీ వి త్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాల ని, ఎవరినీ ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఎ వరు కూడా జోక్యం చేసుకోవద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని మంత్రి తెలిపారు. అటువంటి వా రిపై ఉక్కుపాదం మోపాలన్నారు.


సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వి షయం గత ఏడు సంవత్సరాల పరిపాలనలో తీ సుకున్న చర్యల వల్ల అర్థమవుతుందన్నారు. వ్య వసాయం దండగ అన్ని వారికి సరైన సమాధా నం ఇచ్చినట్లు సీఎం కేసీఆర్‌ రైతు ప్రయోజనాలకు అనేక కార్యక్రమాలు అమలు చే స్తూ రైతు కుటుంబాలలో సంతోషం నింపుతున్నారన్నారు. వ్యవసాయశాఖ అధికారులు రైతులకు కావాల్సి న అన్ని సలహాలు సూచనలు అందిస్తూ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. రైతులు సొంత ఖర్చుతో 50లక్షల ఎకరాలకు నీటిని పారించడానికి 22లక్షల బోర్లు వేసుకున్నారని వాటిలో గ్రౌం డ్‌ వాటర్‌ ఉండేవిధంగా ప్రభుత్వం మిషన్‌ కాకతీయ ద్వారా 45వేల చెరువులలో పూడికతీత తీ సి, వాగుల్లో చెక్‌ డ్యాంల నిర్మాణం చేపట్టిందన్నా రు.


28వేల కోట్లతో విద్యుత్‌ సరఫరాతో పాటు కొ త్త సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌ల లైన్‌లు ఏర్పా టు చేసిందని వివరించారు. రైతులకు కావాల్సిన ఎరువులను, విత్తనాలు సకాలంలో అందించడానికి ఏర్పాటు చేయాలని, కల్లీ విత్తనాలతో రైతు లు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోకుండా ప్ర భుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభు త్వం రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరా కు ప్రతీ సంవత్సరానికి రూ.10వేలు అందిస్తోంద ని, ఇది మొత్తం రూ.14వేల కోట్లని, ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా సహాయం చేయడం లేదన్నారు. ధాన్యం సేకరణలోనూ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందన్నారు.


వానాకాలంలో 5లక్షల 7 వేల 800ల ఎకరాల సాగు అంచనాకు గాను 77 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉం దని, అందులో 24వేల 350 మెట్రిక్‌ టన్నులు స్టా క్‌ ఉందని, డీఏపీ 16,610  మెట్రిక్‌ టన్నులు అవ సరం కాగా.. 1,897 మెట్రిక్‌ టన్నులు ఉందని, ఎంవోపీ 10,402 మెట్రిక్‌ టన్నులకుగాను 2,722  మెట్రిక్‌ టన్నులు ఉందని, కాంప్లెక్స్‌ ఎరువులు 33,878 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా.. 21, 415 మెట్రిక్‌ టన్నులు ఉందన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు, ఎ రువులు, మందుల కొనుగోలుకు అధికారులు చ ర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు లేకుండా టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహించాలన్నారు. సమీ క్షలో ఇన్‌చార్జి సీపీ అరవింద్‌బాబు, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌, ఆర్డీవోలు పాల్గొన్నారు.




మొక్కలు సక్రమంగా ఉండాలి


హరితహారం కార్యక్రమంలో భాగంగా అధికారులు ఫారెస్ట్‌ రీ జనరేషన్‌ అవెన్యూ ప్లాంటేషన్‌ ను పక్కాగా నిర్వహించాలని మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి అటవీశాఖ, పోలీసు, రెవెన్యూ, ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం క లెక్టర్‌రేట్‌లో అధికారులతో హరితహారంపై మం త్రి సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ హరితహారంన కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో 3.8శాతం గ్రీన్‌ కవరేజ్‌ పెరిగిందన్నా రు.


మూడె రోజుల క్రితం సీఎం ఉమ్మడి జిల్లా హైవే మీదుగావెళ్తూ అవెన్యూ ప్లాంటేషన్‌లో గ్యా ప్‌లు ఉన్న విషయాన్ని గుర్తించారన్నారు. ప్లాంటేషన్‌ విషయంలో లక్ష్యాన్ని గుర్తించి పనిచేయాలని అందుకు కలెక్టర్‌లు సహకరించాలన్నారు. అనంతరం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల క లెక్టర్‌లు నారాయణరెడ్డి, శరత్‌ మాట్లాడుతూ  జాతీయ రహదారులకు ఇరువైపులా వనంలా మొక్కలు కనబడాలన్నారు. ఈ సమావేశంలో  మున్సిపల్‌ క మిషనర్‌ జితేష్‌ పాటిల్‌, డీఎఫ్‌వో సునీల్‌, అదనపు కలెక్టర్‌ లత పాల్గొన్నారు.

Updated Date - 2021-06-12T05:47:25+05:30 IST