Advertisement
Advertisement
Abn logo
Advertisement

నకిలీ విత్తన బాధితులను ఆదుకోవాలి

నందిగామ రూరల్‌, నవంబరు 29: నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, కంపెనీల లైసెన్స్‌ రద్దు చేయాలని, బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేశారు. కైలీస్‌ సీడ్స్‌ 414, ఏపీ డీలక్స్‌ సీడ్స్‌, తిరుమల సీడ్స్‌ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, చనుమోలు సైదులు డిమాండ్‌ చేశారు. కటారపు గోపాల్‌, చుండూరు సుబ్బారావు, లక్ష్మీనారాయణ, ఆకుల వెంకట్రావ్‌, చిరంజీవి, పుల్లయ్య, శ్రీనివాసరావు, సాయి, రామారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement