గ్రాసం కొరత..

ABN , First Publish Date - 2020-05-24T09:47:03+05:30 IST

ఎండలు తీవ్రం కావడంతో గ్రాసం కొరత ఏర్పడి మూగజీవాలు అల్లాడుతున్నాయి.

గ్రాసం కొరత..

అలమటిస్తున్న మూగజీవాలు 

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు 

సాకలేక కబేళాలకు తరలింపు


కొడంగల్‌: ఎండలు తీవ్రం కావడంతో గ్రాసం కొరత ఏర్పడి మూగజీవాలు అల్లాడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు దీనికి తోడు గ్రాసం దొరక్క పశుసంపదను కాపాడుకునేందుకు రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. కంకంఒకొడంగల్‌ మండలంలోని రైతులు సేడం, యాద్గీర్‌, తాండూరు తదితర పట్టణాల నుంచి ట్రాక్టర్లు, లారీల్లో పశుగ్రాసాన్ని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. ఎక్కువ ధరలకు గ్రాసాన్ని విక్రయిస్తున్నా చేసేదేమి లేక కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల గ్రాసం దొరక్క పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో పంటలను సాగు చేసిన రైతులు నష్టానికి గురయ్యారు. బోరుబావుల కింద పచ్చిగడ్డిని సాగు చేస్తే కొద్ది రోజులు గ్రాసం కొరతను అధిగమించే వీలుండేదని, ప్రస్తుతం బోర్లలో భూగర్భజాలలు అడుగంటిపోవడంతో అధిక ధరలకు గ్రాసాన్ని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌, కొడంగల్‌ మండలాల్లో గ్రాసం కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం సబ్సిడీ కింద గ్రాసాన్ని అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


సబ్సిడీపై అందించాలి

ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసాన్ని అందించాలి. గ్రాసం కొరతతో పశువులను కబేళాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక ధరలకు గ్రాసాన్ని కొనుగోలు చేయలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. పెద్ద రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. 

- నర్సింహులు, రైతు, కొడంగల్‌ 

Updated Date - 2020-05-24T09:47:03+05:30 IST