దుల్హన్‌ పథకాన్ని అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-07-01T05:14:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిన దుల్హన్‌ పథకాన్ని వెంటనే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఐ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని నేతాజి సర్కిల్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

దుల్హన్‌ పథకాన్ని అమలు చేయాలి
సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్న మైనార్టీలు

సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

రాయచోటిటౌన్‌, జూన్‌ 30: రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిన దుల్హన్‌ పథకాన్ని వెంటనే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఐ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని నేతాజి సర్కిల్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ముస్లిం మహిళల వివాహ సమయంలో ఇచ్చే రూ.50 వేలు ఇవ్వకుండా ప్రభుత్వం నిలిపివేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సాంబశివ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు రంగారెడ్డి, గిరిజన సమైఖ్య నాయకులు విశ్వనాధ్‌నాయక్‌, మహిళా సంఘం నాయకురాలు సుమిత్ర, డీహెచ్‌పీఎ్‌స జిల్లా అధ్యక్షుడు సుధీర్‌కుమార్‌, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T05:14:55+05:30 IST