MPTC సభ్యురాలిని మంగళగిరి ఎమ్మెల్యే ఎందుకు మాయం చేశారు?

ABN , First Publish Date - 2022-05-05T01:53:31+05:30 IST

ఏపీలో రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‎లు రోజుకు రెండు, మూడు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో ...

MPTC సభ్యురాలిని మంగళగిరి ఎమ్మెల్యే ఎందుకు మాయం చేశారు?

అమరావతి/హైదరాబాద్: APలో రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‎లు రోజుకు రెండు, మూడు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉందని ప్రభుత్వం చెబుతున్నా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విమర్శలకు తావిస్తున్నాయి. మరోవైపు జరిగిన సంఘటనలపై అధికార పక్షం చెబుతున్న కారణాలు, మాటలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ఇటీవల రేపల్లెలో జరిగిన ఘటనే. REPALLE రైల్వే స్టేషన్‌లో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి హోంమంత్రి తానేటి వనిత ఇచ్చిన వివరణ ఆమెను అబాసుపాలు చేసింది. యాదృచ్ఛికంగా ఘటన జరిగిందని ఆమె చెప్పడంపై విమర్శలు వెళ్లువెత్తాయి. ఘటనలు జరిగిన వెంటనే చర్యలు తీసుకోకుండా  చిల్లీ కారణాలు చెప్పండంపై విపరీతమైన విమర్శలు వినిపించాయి. 


తాజాగా జరిగిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుగ్గిరాల ఎంపీపీ పదవిని కైవసం చేసుకునేందుకు దుగ్గిరాల-2 ఎంపీటీసీ పద్మావతిని బలవంతంగా తీసుకెళ్లడంపై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు  హిందూపూర్‌లో వైసీపీ నేతల వేధింపులు తాళ్లలేక తల్లీ కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇలా  అధికార పార్టీ నేతలే ఈ విధంగా వ్యవరించడం పట్ల అటు ప్రజలు, ఇటు ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో అసలేం జరుగుతుందని అనే ప్రశ్నలు వారి నుంచి వినిపిస్తున్నాయి. 



ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ‘‘హిందూపురంలో తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు?. ఎంపీటీసీ సభ్యురాలిని మంగళగిరి ఎమ్మెల్యే ఎందుకు మాయం చేశారు?. విజయనగరంలో ఇంట్లో దూరి అత్యాచారం చేయడం దేనికి నిదర్శనం?. రేపల్లెలో అత్యాచారం యాదృచ్ఛికంగా జరిగిందని హోంమంత్రి అనడం సమంజసమేనా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Read more