నాడు రాజకీయ ఒత్తిడి లేకపోవడం వల్లే

ABN , First Publish Date - 2021-12-11T07:05:47+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉద్యోగులు, అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు లేకపోవడం వల్లే ఉ న్నతాధికారుల ఆదేశాలతో ఈ ప్రాజెక్టును పటిష్ఠంగా నిర్మించగలిగారని సా గర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ ధర్మానాయక్‌ అన్నారు.

నాడు రాజకీయ ఒత్తిడి లేకపోవడం వల్లే
నెహ్రూ శంకుస్థాపన చేసిన ఫైలాన్‌ వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న ఎస్‌ఈ ధర్మానాయక్‌

పటిష్ఠంగా సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం

నాగార్జునసాగర్‌ ఎస్‌ఈ ధర్మానాయక్‌

ఘనంగా ప్రాజెక్టు శంకుస్థాపన దినోత్సవం

నాగార్జునసాగర్‌, డిసెంబరు 10: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉద్యోగులు, అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు లేకపోవడం వల్లే ఉ న్నతాధికారుల ఆదేశాలతో ఈ ప్రాజెక్టును పటిష్ఠంగా నిర్మించగలిగారని సా గర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ ధర్మానాయక్‌ అన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 67ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం శంకుస్థాపన దినోత్సవాన్ని సాగర్‌ ఫైలాన్‌ వద్ద నిర్వహించారు. 1955 డిసెంబరు 10వ తేదీన సాగర్‌ ప్రాజెక్టుకు నాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేసిన పైలాన్‌ వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రా ణాలు కోల్పోయిన ఇంజనీర్లకు, అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు నివాళులర్పించారు. నాడు ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్‌ జాఫర్‌అలీఖాన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాడు ప్రాజె క్టు నిర్మాణ సమయంలో ఎందరో ఇంజనీర్లు కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. నేడు చిన్న చిన్న పనులకు మిషన్లు వాడుతున్నామని, నాడు ఎందరో కార్మికులు శ్రమించి ఇంతటి మహాద్భుతమైన ప్రాజెక్టును నిర్మించారన్నారు. ప్రస్తుతం సాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టులో రెండు తెలుగు రాష్ట్ర్టాలల్లో 24 లక్షల ఎకరాలకు సాగు నీరు, కోట్లాది మందికి తాగునీరు అందిస్తోందన్నారు. నాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనంగా సాగర్‌ ప్రాజెక్టు ను చెప్పుకోవచ్చన్నారు. సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేవలం 13లక్షల క్యూసెక్కుల వరదను మాత్రమే తట్టుకునేలా ప్రాజెక్టును నిర్మిస్తే 2009లో 26లక్షల క్యూసెక్కుల వరదను కూడా తట్టుకుందన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ ఎలమందయ్య, డీఈలు సుదర్శన్‌, శ్రీనివాస్‌, ఏఈ లు కృష్ణయ్య, సుజన్‌, సత్యనారాయణ, ఎస్‌పీఎఫ్‌ ఆర్‌ఐ శ్రీనివాస్‌, టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు జానపాటి రాములు, నరసింహమూర్తి, రామంజనేయులు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-11T07:05:47+05:30 IST