పెరుగుతున్న Corona కేసులు.. UAE కీలక నిర్ణయం.. వాటి గడువు కుదింపు!

ABN , First Publish Date - 2022-06-16T13:29:51+05:30 IST

రోనా మమమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా భారత్‌తోపాటు యూఏఈలోనూ కరోనా కేసులు అధిక మొత్తంలో నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కొవిడ్ బాధితుల సంఖ్య రెట్టింపైందని యూఏఈ హెల్త్ మినిస్ట్రీ తాజాగా ప్రకటించింది. ఈ క్ర

పెరుగుతున్న Corona కేసులు.. UAE కీలక నిర్ణయం.. వాటి గడువు కుదింపు!

ఎన్నారై డెస్క్: కరోనా మమమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా భారత్‌తోపాటు యూఏఈలోనూ కరోనా కేసులు అధిక మొత్తంలో నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కొవిడ్ బాధితుల సంఖ్య రెట్టింపైందని యూఏఈ హెల్త్ మినిస్ట్రీ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలోనే డాక్టర్లు కూడా ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో మాస్కును తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఏ మాత్రం కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనిపించినా.. కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. 


ఇదిలా ఉంటే.. కేసులు పెరుగుతున్న తరుణంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. AlHosn యాప్ ద్వారా అందించే గ్రీన్ పాస్‌ల గడువును 30 రోజుల నుంచి 14 రోజులకు తగ్గించింది. దీంతో ఇకపై పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు.. కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్‌ను స్వీకరించిన అనంతరం కేవలం 14 రోజుల గ్రీన్‌పాస్‌ను మాత్రమే పొందనున్నారు. 




Updated Date - 2022-06-16T13:29:51+05:30 IST