తండ్రి అనారోగ్యం వల్లే.. రోహిత్‌ ఆసీస్‌ వెళ్లలేదు

ABN , First Publish Date - 2020-11-28T09:27:19+05:30 IST

రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఎందుకు వెళ్లలేదన్న గందరగోళానికి బీసీసీఐ తెరదించింది. తండ్రి అనారోగ్యం కారణంగా రోహిత్‌ ఆసీస్‌ వెళ్లలేదని స్పష్టం చేసింది. ఈ విషయమై కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్నా బోర్డు స్పందించలేదు. అయితే, రోహిత్‌ అంశంపై అంతా గందరగోళంగా ఉందని, తమకు

తండ్రి అనారోగ్యం వల్లే.. రోహిత్‌ ఆసీస్‌ వెళ్లలేదు

స్పష్టత ఇచ్చిన బీసీసీఐ సిరీష్‌కు ఇషాంత్‌ దూరం


సిడ్నీ: రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఎందుకు వెళ్లలేదన్న గందరగోళానికి బీసీసీఐ తెరదించింది. తండ్రి అనారోగ్యం కారణంగా రోహిత్‌ ఆసీస్‌ వెళ్లలేదని స్పష్టం చేసింది. ఈ విషయమై కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్నా బోర్డు స్పందించలేదు. అయితే, రోహిత్‌ అంశంపై అంతా గందరగోళంగా ఉందని, తమకు ఎలాంటి సమాచారం లేదంటూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురువారం అసహనం వ్యక్తం చేయగా.. ఆ మరుసటి రోజే బోర్డు దీనిపై ప్రకటన చేయడం గమనార్హం. ఇక, సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఆసీస్‌ టూర్‌కు దూరమయ్యాడని బోర్డు తెలిపింది. టెస్టు సిరీస్‌ మొదలయ్యే (వచ్చేనెల 17) నాటికల్లా అతను పూర్తి ఫిట్‌నె్‌సతో ఉండకపోవచ్చని.. అందుకే సిరీస్‌ నుంచి అతడిని తప్పించక తప్పలేదని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపాడు. అలాగే.. ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న రోహిత్‌ ఫిట్‌నె్‌సను వచ్చేనెల 11న పరీక్షిస్తామని వెల్లడించాడు. అతను టెస్టులకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నాడు. కాగా.. రోహిత్‌ విషయంలో ఇంత గందరగోళం నెలకొనడానికి బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ కారణమని తెలుస్తోంది. ఈ విభాగం రోహిత్‌ గురించి సరైన సమాచారాన్ని బోర్డుతో పాటు కెప్టెన్‌ కోహ్లీకి కూడా చేరవేయలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా.. రోహిత్‌ ఫిట్‌గా తేలితే అతడికి ఆసీ్‌సలో 14 రోజుల క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ను బీసీసీఐ చీఫ్‌ గంగూలీ విజ్ఞప్తి చేసే అవకాశముంది. మరోవైపు ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టు తరఫున రాణించిన పేస్‌ బౌలర్‌ నటరాజన్‌ను వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. ప్రస్తుతం జట్టుతోపాటు ఉన్న నవ్‌దీప్‌ సైనీ వెన్నునొప్పిగా ఉందని చెప్పడంతో బ్యాక్‌పగా నటరాజన్‌కు స్థానం కల్పించినట్టు బీసీసీఐ తెలిపింది.

Updated Date - 2020-11-28T09:27:19+05:30 IST