‘ప్రాజెక్టుల కోసం భూ సేకరణ చేసే ముందు భూముల విలువ ఎందుకు పెంచలేదు?’

ABN , First Publish Date - 2022-01-23T16:19:32+05:30 IST

ప్రభుత్వం ఆదాయం కోసమే భూముల మార్కెట్ విలువను పెంచుతోందని శ్రీధర్ బాబు విమర్శించారు.

‘ప్రాజెక్టుల కోసం భూ సేకరణ చేసే ముందు భూముల విలువ ఎందుకు పెంచలేదు?’

హైదరాబాద్: ప్రభుత్వం ఆదాయం కోసమే భూముల మార్కెట్ విలువను పెంచుతోందని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  ప్రాజెక్టుల కోసం భూముల సేకరణ చేసే ముందు ఎందుకు భూముల విలువను పెంచలేదని ప్రశ్నించారు. భూముల ధర పెంచి రైతుల భూములు సేకరిస్తే హర్షించే వాళ్లమని అన్నారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పెంచిన ధర ప్రకారం మరో మారు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిన ఆరు నెలల్లోనే భూముల ధరలు పెంచడం ఎందుకన్నారు. దీంతో రెండు రకాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, కొనుగోలుదారులకు భారమవుతుందన్నారు. ఈ ప్రభుత్వానికి రాబడిపైనే ధ్యాస తప్ప.. ఓ విజన్ అంటూ ఏమీ లేదని దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు.

Updated Date - 2022-01-23T16:19:32+05:30 IST