బాతులతో పొలాలు శుభ్రం!

ABN , First Publish Date - 2020-09-21T05:30:00+05:30 IST

మన దగ్గర కీటకాలు, తెగుళ్ల నుంచి పంటను రక్షించుకోవడం కోసం రకరకాల పురుగు మందులు చల్లుతుంటారు. కానీ థాయ్‌లాండ్‌లో ఏం చేస్తారో తెలుసా! బాగా ఆకలితో ఉన్న బాతులను పంట పొలాల్లోకి వదులుతారు...

బాతులతో పొలాలు శుభ్రం!

మన దగ్గర కీటకాలు, తెగుళ్ల నుంచి పంటను రక్షించుకోవడం కోసం రకరకాల పురుగు మందులు చల్లుతుంటారు. కానీ థాయ్‌లాండ్‌లో ఏం చేస్తారో తెలుసా! బాగా ఆకలితో ఉన్న బాతులను పంట పొలాల్లోకి  వదులుతారు.


  1. ఏటా పంట కోత పూర్తయిన తరువాత ఖాళీ పొలాల్లోకి కొన్ని వేల బాతులను వదులుతుంటారు. ఈ బాతులు పంటను ఆశించే కీటకాలను తినేస్తాయి. నత్తలు, కలుపు మొక్కలు, పొలాల్లో పడిపోయిన బియ్యం గింజలను తింటాయి. మొత్తంగా పొలాల్లో ఎలాంటి పురుగులు లేకుండా శుభ్రం చేస్తాయి.
  2. కొత్తకొత్త పురుగు మందులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా థాయ్‌లాండ్‌ రైతులు మాత్రం ఈ పద్ధతినే ఎంచుకుంటారు. ఎలాంటి పురుగు మందులు చల్లకుండా పంట పొలాలను బాతులతో శుభ్రం చేయించుకుంటారు. అక్కడి రైతులు ఈ పద్ధతిని కొన్ని వందల ఏళ్లుగా అనుసరిస్తున్నారు.

Updated Date - 2020-09-21T05:30:00+05:30 IST