బాతు బొమ్మ భలే!

ABN , First Publish Date - 2020-08-29T05:30:00+05:30 IST

ఒక పేపరు ప్లేటులో చిన్న వృత్తం గీసి కత్తెరతో కత్తిరించాలి. అలా కత్తిరించగా వచ్చిన వృత్తాన్ని బాతు తల భాగంగా అతికించాలి..

బాతు బొమ్మ భలే!

కావలసినవి

 పేపర్‌  ప్లేట్లు ఫ క్రేయాన్లు ఫ పెన్సిల్‌ ఫ కత్తెర ఫ జిగురు


తయారీ

 ఒక పేపరు ప్లేటులో చిన్న వృత్తం గీసి కత్తెరతో కత్తిరించాలి. అలా కత్తిరించగా వచ్చిన వృత్తాన్ని బాతు తల భాగంగా అతికించాలి. 

 మరో చిన్న పేపర్‌ ప్లేటు ముక్కను బాతు ముక్కు ఆకారంలో కత్తిరించుకోవాలి. దాన్ని జిగురుతో అతికిస్తే బాతు బొమ్మ రెడీ. ఇప్పుడు స్కెచ్‌పెన్నులతో కన్ను, రెక్కలు గీయాలి.

 మరో పేపరు ప్లేటుని సగానికి మడిచి బాతుకి ఒకవైపు అతికించాలి. ఆ ప్లేటు బాతుకి ఆధారంగా ఉండి, ముందుకీ వెనక్కీ ఊగడానికి ఉపయోగపడుతుంది.


Updated Date - 2020-08-29T05:30:00+05:30 IST