దుమ్ము రేపేందుకు రెడీనా!

ABN , First Publish Date - 2020-07-01T05:52:49+05:30 IST

సూపర్‌బైక్‌లపై మనసు పడే కుర్రకారు కోసం డుకాటీ సరికొత్తగా ముస్తాబైంది. నవతరం ఇష్టపడే ఎన్నో హంగులనద్ది ‘పనిగల్‌-వీ2’ మోడల్‌ను మార్కెట్‌లోకి వదిలేందుకు సన్నాహాలు చేస్తోంది...

దుమ్ము రేపేందుకు రెడీనా!

కొత్త బండి గురూ! 

సూపర్‌బైక్‌లపై మనసు పడే కుర్రకారు కోసం డుకాటీ సరికొత్తగా ముస్తాబైంది. నవతరం ఇష్టపడే ఎన్నో హంగులనద్ది ‘పనిగల్‌-వీ2’ మోడల్‌ను మార్కెట్‌లోకి వదిలేందుకు సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ మిడిల్‌ వెయిట్‌ సూపర్‌బైక్‌ ఈపాటికే రోడ్డెక్కాల్సింది. కానీ, కరోనా కల్లోలం వల్ల ఆలస్యమైంది. అన్నీ కుదిరితే ఈ నెలలోనే విడుదల కావచ్చని సమాచారం. 


ఇవీ ప్రత్యేకతలు...

  1. డుకాటీ ‘పనిగల్‌-వీ2’ బైక్‌లో 995 సీసీ సూపర్‌ క్వాడ్రో ఇంజన్‌ ఉంది. 
  2. ‘పనిగల్‌-వీ4’తో పోలిస్తే... డిజైన్‌ పరంగా ఇంచూ మించు ఒకేలా కనిపిస్తుంది. అయితే వీ2లో ట్విన్‌ సిలిండర్‌ పవర్‌ట్రయిన్‌ కాస్త చిన్నగా ఉంటుంది. 
  3. రేస్‌, స్పోర్ట్స్‌, స్ట్రీట్‌... ఈ 3 మోడ్స్‌ను బైక్‌ ముందున్న 4.3 అంగుళాల టీఎఫ్‌టీ స్ర్కీన్‌పై నియంత్రించవచ్చు. 
  4. ఇంజన్‌ 10750 ఆర్‌పీఎం వద్ద 153 బీహెచ్‌పీ శక్తిని, 9000 ఆర్‌పీఎం వద్ద 104 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. సిక్స్‌ గేర్‌ బైక్‌ ఇది. 
  5. బైక్‌ ముందు భాగంలో ఎడ్జస్టబుల్‌ షోవా బీపీఎఫ్‌ ఫోర్క్‌ ఉంటే... వెనుక వైపు మాత్రం సాచ్స్‌ ఎడ్జస్టబుల్‌ మోనోషాక్‌ అబ్జార్బర్స్‌ అమర్చారు.  
  6. ముందు వైపు మోనోబ్లాక్‌ కాలిపర్స్‌ బ్రేక్స్‌, వెనుక చక్రానికి సింగిల్‌ 2445 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌ ఉన్నాయి. 
  7. యూరో 5 ఉద్గార ప్రమాణాలు కలిగి ఉన్న ఈ బైక్‌ లుక్‌ అదిరిపోతుంది. ఎల్‌ఈడీ రన్నింగ్‌ ల్యాంప్స్‌ బైక్‌ ముందు, వెనుక భాగాల్లో ఉండడం, ఎగ్జాస్ట్‌ ప్యాకేజీని కనిపించీ, కనిపించనట్లుగా అందంగా బైక్‌ డిజైన్‌లో ఇమడ్చడం లగ్జరీ లుక్‌నిస్తాయి. 
  8. సూపర్‌ బైక్‌లలో దాదాపుగా కనిపించే క్విక్‌ షిప్టర్‌, యాంటీ వీలీ సిస్టమ్‌, కార్నరింగ్‌ ఏబీఎస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 
  9. ధర సుమారు రూ.16 లక్షలు ఉండవచ్చని అంచనా.


డుకాటీ ‘పనిగల్‌-వీ2’ 

ప్రత్యేకతలు: మిడిల్‌ వెయిట్‌ సూపర్‌బైక్‌. 995సీసీ సూపర్‌ క్వాడ్రో ఇంజన్‌, 

4.3 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే. ఈ నెలాఖరులో విడుదల కావచ్చు. 

ధర: రూ.16 లక్షలు (అంచనా) 


Updated Date - 2020-07-01T05:52:49+05:30 IST