Abn logo
Sep 20 2021 @ 19:38PM

డ్యుకాటి మాన్‌స్టర్... బైక్ ధరల వెల్లడి 23 న...

హైదరాబాద్ : ఇటలీకి చెందిన ‘2021 డ్యుకాటి మాన్‌స్టర్’ బుకింగ్‌లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. కాగా వీటి వివిధ మోడళ్ళ ధరలను మాత్రం బుధవారం ప్రకటించనున్నారు. కాగా... ఈ మోటార్ సైకిల్... సూపర్ స్పోర్ట్ 950 కు చెందిన రెండు సిలిండర్లతో కూడిన ఇంజన్ తో నడుస్తుంది. కాగా... భారత్‌లో విడుదల కానున్న ఈ బైక్‌లకు సంబంధించి... మరికొన్ని అడ్వాంటేజీలను కూడా జోడించనుంది. ఎనిగేల్ వీ4, స్ట్రీట్ ఫైటర్ వీ4, మల్టీస్ట్రాడా వీ 4 మోడళ్ళు భారత్ లో విడుదల కానున్నాయి. కాగా... ‘మాన్‌స్టర్ 00’ పేరుతో తయారుకానున్న మరో మోడల్ ను కూడా భారత్ లో సంస్థ విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే... బైక్ బుకింగ్ కోసం టోకెన్ ఎమౌంట్ కింద రూ. లక్షను చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక ఈ బైక్ ఫ్రేం... తేలికగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక ఇప్పటివరకు విడుదలైన మోడళ్ళకన్నా... తాజా మోడల్... మరింత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు కానుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే... భారత్‌లో విడుదల కానున్న ఈ బైక్ కోసం... వాహన ప్రియులు, యువత ఇప్పటికే ఎదురుచూపులు చూస్తున్నారు.