Jun 20 2021 @ 00:37AM

డబ్బింగ్‌ మొదలెట్టారు

కన్నడ కథానాయకుడు సుదీప్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘విక్రాంత్‌ రోణ’. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాలో నటించిన చాలామంది నటీనటులు ప్రస్తుతం డబ్బింగ్‌ చెబుతున్నారు. త్వరలో ఫస్ట్‌ కాపీ సిద్ధమవుతుందని తెలిసింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 55 దేశాల్లో త్రీడీ ఫార్మాట్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు జాన్‌ మంజునాథ్‌, శాలినీ మంజునాథ్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ భండారి దర్శకుడు.