సిబ్బందిలేని పురపాలిక.. సమస్యలు తీర్చేదెవరిక!

ABN , First Publish Date - 2022-05-27T05:49:33+05:30 IST

దుబ్బాక మున్సిపాలిటీలో అధికారులు లేక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. 2009 దుబ్బాక నగరపంచాయతీ ఏర్పడింది. కోర్టులో అభ్యంతరాలతో దశాబ్దకాలంపాటు పాలకమండలి లేకుండానే పాలన సాగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం 2016లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అయినా ప్రభుత్వం ఒక్క పోస్టును కూడా మంజూరు చేయలేదు. కమిషనర్‌తో సహా అన్ని పోస్టులు డిప్యూటేషన్‌పైనే కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు 2020లో మున్సిపాలిటీకి పాలకమండలిని ఎన్నుకున్నారు. అయినా ప్రబుత్వం కనీస కొలువులను మంజూరు చేయకపోవడంతో డిప్యూటేషన్‌పై కమిషనర్‌, బిల్‌కలెక్టర్‌, జూనియర్‌ అసిస్టేంట్‌, మెనేజర్‌తో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

సిబ్బందిలేని పురపాలిక.. సమస్యలు తీర్చేదెవరిక!
దుబ్బాక మున్సిపాలిటీ

ముగ్గురు సిబ్బందితో మూలుగుతున్న దుబ్బాక మున్సిపాలిటీ

పట్టణ ప్రగతిపై ప్రభావం.. అనుమతులకు తప్పని జాప్యం


దుబ్బాక, మే 26: దుబ్బాక మున్సిపాలిటీలో అధికారులు లేక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. 2009 దుబ్బాక నగరపంచాయతీ ఏర్పడింది. కోర్టులో అభ్యంతరాలతో దశాబ్దకాలంపాటు పాలకమండలి లేకుండానే పాలన సాగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం 2016లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అయినా ప్రభుత్వం ఒక్క పోస్టును కూడా మంజూరు చేయలేదు. కమిషనర్‌తో సహా అన్ని పోస్టులు డిప్యూటేషన్‌పైనే కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు 2020లో మున్సిపాలిటీకి పాలకమండలిని ఎన్నుకున్నారు. అయినా ప్రబుత్వం కనీస కొలువులను మంజూరు చేయకపోవడంతో డిప్యూటేషన్‌పై కమిషనర్‌, బిల్‌కలెక్టర్‌, జూనియర్‌ అసిస్టేంట్‌, మెనేజర్‌తో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.


గాడితప్పిన టౌన్‌ప్లానింగ్‌

రెగ్యులర్‌ టౌన్‌ప్లానింగ్‌ అఽధికారి లేక మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్‌ గాడి తప్పింది. టీఐపాస్‌ ద్వారా ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నవారికి ఇబ్బందులు తప్పడం లేదు. అనుమతులు పొందకుండాపూ నిర్మాణం సాగిస్తున్నారు. ప్రభుత్వం, మున్సిపల్‌శాఖ నిర్దేశించిన సెట్‌బ్యాక్‌ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తాత్కాలిక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో దుబ్బాకలో పారిశుధ్యం కొరవడింది. ఎక్కడపడితే అక్కడే చెత్త వేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డుల్లో 108 మంది పారిశుధకచ కార్మికులను నియమించాల్సి ఉన్నది. ప్రస్తుతం 72 మందితోనే పనులు సాగిస్తున్నారు. దీంతో కాలనీల్లో చెత్త పేరుకుపోతున్నది. వీధులు కంపు కొడుతున్నాయి. అలాగే, దుకాణాలు, హోటళ్లను తనిఖీ చేసేవారు కరువయ్యారు. 


అసిస్టెంట్‌ ఇంజనీర్‌ లేక అవస్థలు

పట్టణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ లేకపోవడంతో పనులు పట్టాలెక్కడం లేదు. అభివృద్ధి అంచనాలు, ప్రణాళికల తయారీలో తీవ్రజాప్యం జరుగుతున్నది. పర్యవేక్షణ లేక పనుల్లో నాణ్యత కొరవడుతున్నది. ఇటీవల వివిధ పద్దులపై మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ మంజూరు చేసిన రూ. 20 కోట్ల అభివృద్ధి పనుల కేటాయింపులో జాప్యం జరుగుతున్నది. 


పన్నుల వసూలు అంతంతే

మున్సిపాలిటీలో ప్రతీఏట రూ. 1.30 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉన్నది. కానీ బిల్‌కలెక్టర్‌ లేకపోవడంతో పన్నుల వసూలు మందగిస్తున్నది. మరో బిల్‌కలెక్టర్‌, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు మంజూరీ చేయాల్సి ఉన్నది. ఇవికాకుండా మున్సిపాలిటీకి 30 పోస్టులు మంజూరీ చేయాల్సి ఉన్నది. పూర్తిస్థాయి పోస్టులు మంజూరు అయితేనే మున్సిపాలిటీ పాలన గాడిలో పడుతుంది. 

Updated Date - 2022-05-27T05:49:33+05:30 IST