Taxi Driver: దుబాయిలో నిజాయితీ చాటిన ట్యాక్సీ డ్రైవర్.. రూ.2కోట్లు రిటర్న్!

ABN , First Publish Date - 2022-07-29T18:19:27+05:30 IST

తన కారులో ప్రయాణికుడు మరిచిపోయి వెళ్లిన 1మిలియన్ దిర్హమ్స్(రూ.2కోట్లు)తో కూడిన బ్యాగ్‌ను ట్యాక్సీ డ్రైవర్ (Taxi Driver) తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన ఘటన దుబాయ్‌ (Dubai)లో జరిగింది.

Taxi Driver: దుబాయిలో నిజాయితీ చాటిన ట్యాక్సీ డ్రైవర్.. రూ.2కోట్లు రిటర్న్!

దుబాయ్: తన కారులో ప్రయాణికుడు మరిచిపోయి వెళ్లిన 1మిలియన్ దిర్హమ్స్(రూ.2కోట్లు)తో కూడిన బ్యాగ్‌ను ట్యాక్సీ డ్రైవర్ (Taxi Driver) తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన ఘటన దుబాయ్‌ (Dubai)లో జరిగింది. దాంతో ట్యాక్సీ డ్రైవర్‌ నిజాయితీని మెచ్చుకుని దుబాయ్ ఆర్‌టీఏ, పోలీస్ విభాగం ఘనంగా సన్మానించాయి. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల చైర్మన్ మత్తర్ మహమ్మద్ అల్ తాయర్ ట్యాక్సీ డ్రైవర్‌తో పాటు తమ వీధులను నియబద్ధతతో నిర్వర్తించిన తమ సిబ్బందిని ప్రత్యేక ప్రశంస పత్రాలను అందజేసి వారి సేవలకు ధన్యవాదాలు తెలిపారు.


వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల తన ట్యాక్సీలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఒక బ్యాగును మరిచిపోయి వెళ్లడం డ్రైవర్ ఉమర్ అల్తాఫ్ హుస్సేన్ గుర్తించాడు. ఆ బ్యాగును ఓపెన్ చేసి చూస్తే భారీ మొత్తంలో నగదు కనిపించింది. దాంతో వెంటనే అక్కడే వీధులు నిర్వహిస్తున్న పార్కింగ్ ఇన్‌స్పెక్టర్ ఒబేద్ మిఫ్తా అబ్దుల్లా‌కు ఆ బ్యాగును అప్పగించాడు. దాంతో ఒబేద్ ఆ బ్యాగును పోలీస్ విభాగానికి అందజేశారు. ఇలా భారీ నగదు ఉన్న బ్యాగును రిటర్న్ చేసిన డ్రైవర్ అల్తాఫ్ నిజాయితీని (Honesty) మెచ్చుకున్న అధికారులు అతనికి గురువారం ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రశంస పత్రంతో పాటు కొంత నగదును బహుమానం అందజేశారు. 

Updated Date - 2022-07-29T18:19:27+05:30 IST