దుబాయిలో ప్రధాని మోదీపై పాట పాడిన 15ఏళ్ల బాలిక!

ABN , First Publish Date - 2020-09-25T21:49:23+05:30 IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న 70వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భా

దుబాయిలో ప్రధాని మోదీపై పాట పాడిన 15ఏళ్ల బాలిక!

దుబాయి: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న 70వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన 15ఏళ్ల సుచేత సతీష్.. దుబాయిలో ప్రధాని నరేంద్ర మోదీపై పాట పాడారు. ‘నమో నమో విశ్వగురు భారత్’ అంటూ సుచేత సతీష్ పాడిన పాటను తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో ఆమె పాడిన పాట.. నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాటలో ప్రధాని మోదీ రాజకీయ జీవితం, ‘మేడ్ ఇన్ ఇండియా’ గురించి సుచేత సతీష్ వివరించారు. ఈ పాటను మలయాళ రచయిత, సింగర్ అజయ్ గోపాల్ రాసినట్లు సుచేత సతీష్ పేర్కొన్నారు. ఆయన రాసిన పాటను తన తల్లి సుమిత.. హిందీలోకి అనువదించారని ఆమె వివరించారు. పాటకు సంబంధించిన కాపీని దుబాయిలోని భారత కాన్సుల్ జనరల్ అమన్ పూరికి ఈ రోజు అందజేసినట్లు సుచేత సతీష్ తెలిపారు. కాగా.. సుచేత సతీష్.. గతంలో 120 భాషల్లో పాటలు పాడి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కొవిడ్ -19పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆమె 29 భాషల్లో పాటలు పాడారు. 


Updated Date - 2020-09-25T21:49:23+05:30 IST